Kangana Ranaut : చరిత్రలో తొలిసారి.. రావణ దహనం చెయ్యనున్న మహిళా సెలబ్రిటీ
X
దసరా ఉత్సవాల్లో చివరగా రావణ దహనం చేస్తారన్న విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో కూడా ప్రతీ ఏటా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అయితే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి చేస్తుండగా ఈసారి మాత్రం.. ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హాజరుకానున్నారు. 50 ఏళ్ల చరిత్రలో మొదటిసారి తొలిసారి ఓ మహిళా సెలబ్రిటీ ఈ కార్యక్రమానికి వెళ్లి రావణ దహనం చేయడం ఇదే తొలిసారి. అక్టోబర్ 24 సాయంత్రం ఈ కార్యక్రమం జరగనుంది.
సాధారణంగా ఢిల్లీలోని లవ్ కుశ్ రామ్ లీలా మైదానంలో రావణుడి దహనం కార్యక్రమాన్ని ప్రధానమంత్రి చేస్తుంటారు. అయితే, ఎన్నికల కారణంగా మోదీ చాలా బిజీగా ఉండటంతో ఈ కార్యక్రమాన్ని చెయ్యలేకపోతున్నారు.. అలాగే ఈ ఏడాది మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ సారి మహిళా సెలబ్రిటీ కంగనా రనౌత్ ను రావణ్ దహన్ కార్యక్రమానికి రామ్ లీలా కమిటీ ఆహ్వానించింది. ఈ మెగా ఈవెంటుకు ఆమెతో పాటు పలువురు బాలివుడ్ సెలబ్రిటీలు హాజరవుతున్నారని సమాచారం.
ఈ విషయాన్ని తెలుపుతూ కంగనా ఓ ప్రత్యేక వీడియో విడుదల పోస్ట్ చేశారు. ‘50 ఏళ్ల నుంచి వేడుక జరుగుతుంది. కానీ, రావణ్ దహన్ వేడుకను ఓ మహిళ చేయడం ఇదే తొలిసారి. ఆ అవకాశం నాకు లభించడం ఎంతో సంతోషంగా ఉంది’ అని చెప్పారు. అలాగే తన తాజా సినిమా ‘తేజస్’ అక్టోబర్ 27న విడుదల కానుందని తెలిపారు. ఈ సినిమాకు సర్వేష్ మేవారా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మించారు. ఈ సినిమాను అక్టోబర్ 27వతేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు..