Home > భక్తి > ఓరీ మీ భక్తి బంగారం కానూ.. ఇంటికి తీసుకొచ్చి పాముకు పూజలా ..

ఓరీ మీ భక్తి బంగారం కానూ.. ఇంటికి తీసుకొచ్చి పాముకు పూజలా ..

ఓరీ మీ భక్తి బంగారం కానూ.. ఇంటికి తీసుకొచ్చి పాముకు పూజలా ..
X

శ్రావణమాస మొదటి సోమవారంతో పాటు నాగపంచమి కావడంతో దేశంలోని పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులు కోలాహలంగా నాగదేవత విగ్రహాలకు పూజలు చేశారు. పుట్టలో పాలు పోసి.. తమ మొక్కులు చెల్లించుకున్నారు. పుట్ట దగ్గర పూజలు.. ఆ పుట్ట దగ్గర ఒకవేళ పాము ప్రత్యక్షంగా కనిపిస్తే నేరుగా దానికే పూజలు చేయడం చూసే ఉంటాం... కానీ కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలో నిజమైన పామును ఇంటికి తీసుకొచ్చి మరీ పూజలు నిర్వహిస్తోంది ఓ కుటుంబం. ఏటా నాగ పంచమి రోజున ఇలా ప్రత్యేకంగా పూజలు జరుపుతోంది.

సిరాసీలోని ప్రశాంత్ హులేకల్ అనే వ్యక్తికి పాములు అంటే చాలా ఇష్టమట. అందుకే ప్రతి ఏటా నాగుల పంచమికి.. కుటుంబంతో కలసి పాములకు పూజలు చేస్తారట. పండుగ రోజున ప్రత్యేకంగా ఓ పామును ఇంటికి తీసుకొచ్చి పూజలు చేసే ఆ కుటుంబం.. ఈసారి మరింత ప్రత్యేకంగా.. పాము పిల్లకు పూజలు చేశారు. సమాజానికి పాములను సంరక్షించాలన్న సందేశాన్ని ఇచ్చేందుకే ఇలా చేస్తున్నట్లు ప్రశాంత్ చెబుతున్నాడు. గడిచిన 35 ఏళ్లుగా ఆయన సరీసృపాల సంరక్షణకు కృషి చేస్తున్నాడు. సర్పాల గురించి అవగాహన కల్పించేందుకే తానున ఇలా పూజలు చేస్తానని, పాముల పట్ల ప్రత్యేక భక్తి ఉందని చెబుతున్నాడు. నాగుల పంచమి రోజు అడవి నుంచి పామును పట్టుకొచ్చి పూజలు చేసి, ఆ తర్వాత దాన్ని విడిచిపెడతామని చెప్పాడు.

ప్రశాంత్ తండ్రి సురేశ్ సైతం పాముల సంరక్షణకు పాటుపడేవారు. సురేశ్ మరణం తర్వాత ఆయన కొడుకులు ప్రశాంత్, ప్రకాశ్, ప్రణవ్​లు.. పాముల సంరక్షణకు పాటుపడుతున్నారు. ప్రత్యేక పూజలు చేసే బాధ్యతలు తీసుకున్నారు. పాముకు పుష్పాలు, దండలతో అలంకరించి హారతి ఇస్తున్నారు. అంతేకాదు.. స్థానికంగా ఎక్కడైనా పాము కనిపించిందని ఫోన్ వచ్చిందంటే వీరు అక్కడికి వెళ్లిపోతారు. పామును జాగ్రత్తగా పట్టుకొని... ఆ తర్వాత దాన్ని దగ్గర్లోని అడవిలో విడిచిపెడతారు. అటవీ శాఖ అధికారులు సైతం పాములను పట్టేందుకు ప్రశాంత్ సాయం తీసుకుంటారు.

Updated : 22 Aug 2023 8:14 AM IST
Tags:    
Next Story
Share it
Top