Home > భక్తి > Mahajatara : భక్తులతో కోలహాలంగా మారిన మేడారం

Mahajatara : భక్తులతో కోలహాలంగా మారిన మేడారం

Mahajatara  : భక్తులతో కోలహాలంగా మారిన మేడారం
X

మహా కుంభమేళాకు తెలంగాణ వేదిక కానుంది. మరో నాలుగు రోజుల్లో ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. మహాజాతర సమీపిస్తుండడంతో అమ్మవార్లకు ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. వేల సంఖ్యలో తరలివచ్చి వనదేవతలను దర్శించకుంటున్నారు. ముందుగా జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి, అమ్మల దర్శనానికి గద్దెల వద్ద బారులు తీరారు. ఇప్పటివరకు 30 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.

మహాజాతర నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎక్కడికక్కడ చర్చలు తీసుకొంటుంది. జాతర ఏర్పాట్లను మంత్రి సీతక్క దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. జాతర నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవార్ల దర్శనానికి బారులు తీరారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాలు ట్రాఫిక్ తో నిడిపోయింది. వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకునేందుకు మేడారానికి చేరుకుంటున్నారు. దీంతో మేడారం వెళ్లే దార్లన్నీ రద్దీగా మారాయి.

ఈ నెల 21 నుంచి 24 వరకు మహాజాతర జరగనుంది. దాదాపు కోటిమందికి పైగా భక్తులు వనదేవతల దర్శనానికి రానున్నట్లు తెలుస్తోంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.




Updated : 17 Feb 2024 9:59 AM IST
Tags:    
Next Story
Share it
Top