మహాశివరాత్రి..ఆలయాలకు పోటెత్తిన భక్తులు
X
దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భోళా శంకురుని దర్శించుకోడానికి తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ వెల్లువిరుస్తోంది. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాలన్ని మారుమోగుతున్నాయి. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ శివాలయాలు శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువైంది. శివలింగాన్ని దర్శించుకొని పాలాభిషేకాలు, రుద్రాభిషేకాలతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.