Home > భక్తి > అన్నవరంలో పెళ్లి చేయించాలంటే..కండీషన్స్ అప్లై !

అన్నవరంలో పెళ్లి చేయించాలంటే..కండీషన్స్ అప్లై !

అన్నవరంలో పెళ్లి చేయించాలంటే..కండీషన్స్ అప్లై !
X

కాకినాడ జిల్లాలోని అన్నవరం దేవస్థానం అధికారుల తీరు రోజు రోజుకు చర్చనీయంశంగా మారుతోంది. ఆలయ అధికారులు గత కొంత కాలంగా తీసుకుంటున్న నిర్ణయాలు హాట్ టాపిక్‎గా మారుతున్నాయి. తాజాగా అన్నవరం పుణ్యక్షేత్రంలో వివాహం చేయించేవారి కోసం ఓ కొత్త రూల్‎ను తీసుకువచ్చింది దేవస్థానం బోర్డు. దేవస్థానం జారీ చేసిన ధ్రువపత్రాలు పొందితేనే వివాహం జరిపించేందుకు అనుమతిస్తామంటూ కొత్త నిబంధనను అధికారులు ప్రకటించారు. దీంతో అన్నవరం దేవస్థానం మరోసారి చర్చల్లో నిలిచింది.

అన్నవరం దేవస్థానం ఆమోదించిన ధ్రువపత్రం ఉంటేనే పెళ్లిళ్లు చేయించడానికి వచ్చే బ్రాహ్మణులు, డోలు సన్నాయి వాయిద్యకారులను ఆలయంలోనికి అనుమతిస్తామని శుక్రవారం అధికారులు ఓ ప్రకటన చేశారు. తమ ఆధార్‌కార్డు, కుల, విద్యార్హత, పాండిత్య, గెజిటెడ్‌ అధికారి జారీ చేసిన సత్ప్రవర్తన, పురోహిత సంఘం జారీచేసిన సర్టిఫికేట్లు, డోలు సన్నాయి వాయిద్యకారులైతే వారి సొంత పరికరంతో ఫొటోతో పాటు పలు ధ్రువీకరణ పత్రాలతో రావాల్సి ఉంటుందన్నారు. అంతే కాదు వారు రూ.2 వేలు చెల్లించి గుర్తింపుకార్డు తీసుకోవాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్డు ఉంటేనే కొండపై అనుమతిస్తామని తమ ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే హాట్ టాపిక్‎గా మారింది. దీంతో ఈ అంశం వివాదాస్పదంగా మారుతుందని గుర్తించి అధికారులు కాస్త ఈ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించారు.

Updated : 2 Sep 2023 3:56 AM GMT
Tags:    
Next Story
Share it
Top