Home > భక్తి > Ganesh Chaturthi 2023 : వినాయక పూజను ఇలా చేస్తే ఎంతో సంతోషిస్తాడు..

Ganesh Chaturthi 2023 : వినాయక పూజను ఇలా చేస్తే ఎంతో సంతోషిస్తాడు..

Ganesh Chaturthi 2023 : వినాయక పూజను ఇలా చేస్తే ఎంతో సంతోషిస్తాడు..
X

హిందువులు ఏ శుభకార్యం మొదలుపెట్టినా తొలుత పూజ చేసేది బొజ్జ గణపయ్యకే. చేపట్టిన పని నిరాటంకంగా సాగాలని విఘ్నరాజును కొలుస్తారు. ఏడాదంతా ఆయన్ను ప్రార్థించడం ఒక ఎత్తు.. వినాయక చవితి రోజున ప్రార్థించడం మరో ఎత్తు. గణేశ పూజ కేవలం పెద్దలకే కాదు, పిల్లలకు కూడా పెద్ద పండగే. పుస్తకాలను దేవుడి దగ్గరి ఉంచి, తమకు చదువు బాగా రావాలని కోరుకుంటారు. వినాయకుడి కథను ఆసక్తిగా తెలుసుకుంటారు. రుచికరమైన పిండివంటలను కోరికోరి మరీ ఆరగిస్తారు. ఎన్నో విశేషాలు, ఎంతో సందడితో సాగే గణేశ్ పూజను ఎవరికి తోచినట్లు వారు చేసుకుంటారు. అయితే పెద్దలు సూచించిన పద్ధతిలో చేస్తే పార్వతీసుతుడు మరింత సంతోషపడతారంటారు. పూజకు ఘనమైన ఏర్పాట్లేవీ లేకున్నా.. కేవలం భక్తితో కాసింత పత్రితో కొలిచినా లంబోదరుడు కరుణావర్షం కురిపిస్తాడు. మరి ఆయన్ను ఏలా పూజించాలో తెలుసుకుందామా?

పర్యావరణానికి హాని చేయని మట్టివిగ్రహాలనే వాడాలి. శుభముహూర్తంలో గణపయ్యను ఇంటికి తీసుకొస్తే మేలు. విగ్రహం ముందు తమలపాకులో చిన్న పసుపుముద్దను కూడా ఉంచాలి. పత్రితోపాటు బెల్లం, పళ్లు, మొక్కజొన్న కంకులు, చెరుకుగడలు, పిండివంటలు నైవేద్యగా పెట్టాలి. వాటి వద్ద నీళ్లు చిలకరించి వినాయకుణ్ని స్తుతించాలి. ‘అమృతోపస్తరణమసి’ అని పలకాలి. తర్వాత వినాయక మంత్రాలు పఠించాలి. మంత్రాలు రానివారు ‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే’ చదివినా సరిపోతుంది. షోడశోపచారాలకంటే భక్తి ముఖ్యమని అర్థం చేసుకోవాలి. మంత్రాలు వచ్చినవారు ఆచమనం, పత్రపూజ, షోడవోపచారాలు,వత్రకథ పఠనం పూర్తి చేయాలి. ఈ పూజావిధానాలేమీ తెలియకుకున్నా కంగారు పడాల్సిన అవసరం లేదు. అష్టోత్తర నామావళితోనూ పూజ ముగించవచ్చు.

అష్టోత్తర నామావళి

ఓం గజాననాయ నమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం విఘ్నారాజాయ నమః

ఓం వినాయకాయ నమః

ఓం ద్త్వెమాతురాయ నమః

ఓం ద్విముఖాయ నమః

ఓం ప్రముఖాయ నమః

ఓం సుముఖాయ నమః

ఓం కృతినే నమః

ఓం సుప్రదీపాయ నమః (10)

ఓం సుఖనిధయే నమః

ఓం సురాధ్యక్షాయ నమః

ఓం సురారిఘ్నాయ నమః

ఓం మహాగణపతయే నమః

ఓం మాన్యాయ నమః

ఓం మహాకాలాయ నమః

ఓం మహాబలాయ నమః

ఓం హేరంబాయ నమః

ఓం లంబజఠరాయ నమః

ఓం హ్రస్వగ్రీవాయ నమః (20)

ఓం మహోదరాయ నమః

ఓం మదోత్కటాయ నమః

ఓం మహావీరాయ నమః

ఓం మంత్రిణే నమః

ఓం మంగళ స్వరాయ నమః

ఓం ప్రమధాయ నమః

ఓం ప్రథమాయ నమః

ఓం ప్రాజ్ఞాయ నమః

ఓం విఘ్నకర్త్రే నమః

ఓం విఘ్నహంత్రే నమః (30)

ఓం విశ్వనేత్రే నమః

ఓం విరాట్పతయే నమః

ఓం శ్రీపతయే నమః

ఓం వాక్పతయే నమః

ఓం శృంగారిణే నమః

ఓం ఆశ్రిత వత్సలాయ నమః

ఓం శివప్రియాయ నమః

ఓం శీఘ్రకారిణే నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం బలాయ నమః (40)

ఓం బలోత్థితాయ నమః

ఓం భవాత్మజాయ నమః

ఓం పురాణ పురుషాయ నమః

ఓం పూష్ణే నమః

ఓం పుష్కరోత్షిప్త వారిణే నమః

ఓం అగ్రగణ్యాయ నమః

ఓం అగ్రపూజ్యాయ నమః

ఓం అగ్రగామినే నమః

ఓం మంత్రకృతే నమః

ఓం చామీకర ప్రభాయ నమః (50)

ఓం సర్వాయ నమః

ఓం సర్వోపాస్యాయ నమః

ఓం సర్వ కర్త్రే నమః

ఓం సర్వనేత్రే నమః

ఓం సర్వసిధ్ధి ప్రదాయ నమః

ఓం సర్వ సిద్ధయే నమః

ఓం పంచహస్తాయ నమః

ఓం పార్వతీనందనాయ నమః

ఓం ప్రభవే నమః

ఓం కుమార గురవే నమః (60)

ఓం అక్షోభ్యాయ నమః

ఓం కుంజరాసుర భంజనాయ నమః

ఓం ప్రమోదాయ నమః

ఓం మోదకప్రియాయ నమః

ఓం కాంతిమతే నమః

ఓం ధృతిమతే నమః

ఓం కామినే నమః

ఓం కపిత్థవనప్రియాయ నమః

ఓం బ్రహ్మచారిణే నమః

ఓం బ్రహ్మరూపిణే నమః (70)

ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః

ఓం జిష్ణవే నమః

ఓం విష్ణుప్రియాయ నమః

ఓం భక్త జీవితాయ నమః

ఓం జిత మన్మథాయ నమః

ఓం ఐశ్వర్య కారణాయ నమః

ఓం జ్యాయసే నమః

ఓం యక్షకిన్నెర సేవితాయ నమః

ఓం గంగా సుతాయ నమః

ఓం గణాధీశాయ నమః (80)

ఓం గంభీర నినదాయ నమః

ఓం వటవే నమః

ఓం అభీష్ట వరదాయినే నమః

ఓం జ్యోతిషే నమః

ఓం భక్త నిధయే నమః

ఓం భావగమ్యాయ నమః

ఓం మంగళ ప్రదాయ నమః

ఓం అవ్వక్తాయ నమః

ఓం అప్రాకృత పరాక్రమాయ నమః

ఓం సత్యధర్మిణే నమః (90)

ఓం సఖయే నమః

ఓం సరసాంబు నిధయే నమః

ఓం మహేశాయ నమః

ఓం దివ్యాంగాయ నమః

ఓం మణికింకిణీ మేఖాలాయ నమః

ఓం సమస్తదేవతా మూర్తయే నమః

ఓం సహిష్ణవే నమః

ఓం సతతోత్థితాయ నమః

ఓం విఘాత కారిణే నమః

ఓం విశ్వగ్దృశే నమః (100)

ఓం విశ్వరక్షాకృతే నమః

ఓం కళ్యాణ గురవే నమః

ఓం ఉన్మత్త వేషాయ నమః

ఓం అపరాజితే నమః

ఓం సమస్త జగదాధారాయ నమః

ఓం సర్త్వెశ్వర్యప్రదాయ నమః

ఓం ఆక్రాంత చిదచిత్ప్రభవే నమః

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః (108)

Updated : 17 Sept 2023 11:20 AM IST
Tags:    
Next Story
Share it
Top