రాములోరి ప్రాణ ప్రతిష్ఠ వేడుక.. ఆ రోజున ఆఫీసులకు హాఫ్ డే హాలిడే
X
అయోధ్యలోని రామమందిర ప్రాణప్రతిష్ట వేడుక పురస్కరించుకోని కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జనవరి 22న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్ హాలీడే ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కార్యాయాలన్నింటికీ ఇది వర్తిస్తుందని తెలిపింది. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల వరకూ ఆఫీసులు మూసి ఉంటాయని పేర్కొంది. ఉద్యోగుల మనోభావాలు, అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఉద్యోగులు పండుగలో పాల్గొనేందుకు వీలుగా భారతదేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర సంస్థలు,కేంద్ర పారిశ్రామిక సంస్థలు 22 జనవరి 2024న మధ్యాహ్నం 2:30 గంటల వరకు సగం రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించామని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
యూపీ, మధ్యప్రదేశ్, పలు రాష్ట్రల విధ్యాసంస్ధలు, గవర్నమెంట్ ఆఫీసులకు హాలీడే ప్రకటించారు. మరి కొన్ని రాష్టాల్లో మద్యం, మాంసం, షాపులను జనవరి 22న మూసివేయాలని అక్కడ ప్రభుత్వాలు ఆదేశాలు జారీచేశాయి. కాగా, హిందువుల దశాబ్దాల కల అయోధ్యలోని రామమందిరం ఎట్టకేలకు నెరవేరింది. సుప్రీంకోర్టు తీర్పుతో వివాదానికి తెరపడటంతో మూడున్నరేళ్ల కిందట ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది