రేపటి నుంచి శబరిమల ఆలయం బంద్.. మళ్లీ తెరిచేది ఎప్పుడంటే?
Bharath | 26 Dec 2023 9:58 PM IST
X
X
శబరిమల దేవస్థానం తలుపులు మరోసారి మూతపడనున్నాయి. రేపు మూసివేయనున్నట్లు ఆలయ కమిటి ప్రకటించింది. మండల మహోత్సవం పూర్తయిన అనంతరం రేపు (డిసెంబర్ 27) రాత్రి 11:00 గంటలకు ఆలయాన్ని మూసేస్తున్నారు. మకరవిళక్కు మహోత్సవం కోసం డిసెంబర్ 30న సాయంత్రం 5.00 గంటలకు తిరిగి ఆలయ తలుపులు తెరుస్తారు. జ్యోతి సందర్శనం జనవరి 15వ తేదీ సాయంత్రం 6.36 గంటలకు ఉండనుంది. ఆ తర్వాత జనవరి 20వ తేదీ ఉదయం 6.30 గంటలకు ఆలయం తిరిగి మూసివేస్తారు. ఆ తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించరు.
Updated : 26 Dec 2023 9:58 PM IST
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire