Ayodhya Ram mandir: AI కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో భద్రత కట్టుదిట్టం
X
జనవరి 22వ తేదీన జరిగే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట వేడుక కోసం సర్వం సిద్ధం అయింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అధునాతన భద్రత, ట్రాఫిక్ నిర్వహణ కోసం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తుంది. దీనికోసం సీసీటీవీ కెమెరాలు, యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటుచేసింది. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ సాయంతో సిటీ మొత్త 1500 పబ్లిక్ సీసీటీవీ కెమెరాలతో సమగ్రమైన నిఘా, అయోధ్య ఎల్లో జోన్ లో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో కూడిన 10,715 AI ఆధారిత కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ సెంట్రల్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తారు.
వైమానిక ముప్పుల నుండి భద్రత కల్పించేందుకు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు యాంటీ డ్రోన్ వ్యవస్తను మోహరించారు. ఈ వ్యవస్తను ప్రత్యేక భద్రతా దళం SSF పర్యవేక్షిస్తుంది. వీటితో పాటు NDRF, SDRF బృందాలను ఇప్పటికే అయోధ్యలో మోహరించారు. ఇక కొత్తగా నిర్మించిన అయోధ్య రైల్వే స్టేషన్‌లో జనవరి 27 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ భద్రతను పెంచడం గమనార్హం.