రేపే శివరాత్రి.. పొరపాటున కూడా ఆ పనులు చేయొద్దు!
X
దేశవ్యాప్తంగా ప్రజలంతా ఎంతో సంబరంగా చేసుకునే పండగల్లో శివరాత్రి కూడా ఒకటి. శివరాత్రికి భక్తులంతా ఉపవాసం ఉండి, జాగరణ చేస్తారు. అలా చేయడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. ప్రతి ఏడాది శివరాత్రి పండగను ఫాల్గున మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశి తిథి రోజున జరుపుకుంటారు. శివరాత్రి రోజు ఉదయాన్నే శివుడికి అభిషేకాలు, పూజలు చేస్తారు. అయితే కొన్ని వస్తువులను ఉపయోగించి పూజను అస్సలు చేయకూడదు. మరి ఆ వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శివుడికి పూజ చేసేటప్పుడు తులసిని అస్సలు వినియోగించరు. కేవలం విష్ణు పూజలోనే తులసిని పూజకు వాడుతారు. అలాగే హిందూ పండగలల్లో కచ్చితంగా ఉపయోగించేది పసుపు. ఏ శుభకార్యం అయినా పసుపును కచ్చితంగా ఉపయోగిస్తారు. కానీ శివ పూజలో మాత్రం పసుపును వాడరు. పసుపు అనేది స్త్రీలకు సంబంధించినది కావడం వల్ల శివుని పూజకు వినియోగించరు. శివలింగానికి పసుపును పూయడాన్ని తప్పుగా భావిస్తారు.
విరిగిన బియ్యాన్ని శివుడి పూజలో వినియోగించరు. విరిగిన బియ్యంతో చేసిన అక్షింతలను కూడా శివపూజకు వాడరు. హిందూ సంప్రదాయంలో విరిగిన బిర్యాన్ని అశుభంగా భావిస్తారు. అందుకే శివ పూజకు ఆ బియ్యాన్ని ఉపయోగించరు. ఇకపోతే పరమేశ్వరుడి పూజలో శంఖాన్ని కూడా వాడరు. శంఖంలో శంఖుడు అనే రాక్షసుడు ఉంటాడని, ఆ శంఖంతో నీటిని ఉపయోగించరు. ఇది శివరాత్రి రోజున మాత్రమే ఉంటుంది. శివరాత్రికి ఉపవాసం ఉన్నవారు టీ తాగకూడదు. కొబ్బరినీళ్లు, నిమ్మరసం వంటివి సేవిస్తారు.
Krishna
సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.