హైదరాబాద్ నుంచి పూరీ జగన్నాథ్ రథయాత్రకు ప్రత్యేక రైళ్లు
X
పూరీ జగన్నాథుని రథయాత్రకు సమయం ఆసన్నమైంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రథయాత్రను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 20న జరగబోయే యాత్రనుతిలకించేందుకు దేశ విదేశాల నుంచి చాలా మంది భక్తులు తరలిరానున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది భక్తులు పూరీ జగన్నాథుని రథయాత్ర వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వారికి దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త చెప్పింది.
హైదరాబాద్ నుంచి పూరీ జగన్నాథ్ రథయాత్రకు ప్రత్యేక రైళ్లు
పూరీ జగన్నాథుని రథయాత్రకు వెళ్లే భక్తులకు కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. జూన్ 18వ తేదీ నుంచి 22 మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాందేడ్ నుండి ఈ రైళ్లు నడుస్తాయి. ఈ నెల 18న సికింద్రాబాద్ నుండి మలాటిపట్పూర్, 19న మలాటిపట్పూర్ నుండి సికింద్రాబాద్ కు, ఈ నెల 19న నాందేడ్ నుండి ఖుర్దా రోడ్, 20న ఖుర్దా రోడ్ నుండి నాందెడ్ కు, ఈ నెల 21న కాచిగూడ నుండి మలాటిపట్పూర్, 21న మలాటిపట్పూర్ నుండి కాచిగూడకు రైళ్లు అందుబాటులో ఉంటాయి. టిక్కెట్ రిజర్వేషన్ సదుపాయం ఇప్పటికే ప్రారంభమైంది.