Home > భక్తి > సాగరతీరంలో రూ.2 కోట్లతో ఖైరతాబాద్ గణేషుడికి పెద్ద గద్దె

సాగరతీరంలో రూ.2 కోట్లతో ఖైరతాబాద్ గణేషుడికి పెద్ద గద్దె

సాగరతీరంలో రూ.2 కోట్లతో ఖైరతాబాద్ గణేషుడికి పెద్ద గద్దె
X

భాగ్యనగరంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. నవరాత్రలు పూజల అనంతరం గణేష్‌ నిమజ్జనాలు, శోభాయాత్రలతో నగరం దద్దరిల్లిపోతుంది. ముఖ్యంగా హైదరాబాద్‎లో వినాయక చవితి అనగానే ఖైరతాబాద్ గణేషుడి పేరు ముందుగా వినిపస్తుంది. నగరంలోనే అత్యంత భారీ గణేషుడు ఇక్కడే కొలువుదీరుతాడు. ఇక నిమజ్జనం సమయంలో రాష్ట్ర సర్కార్ ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటుంది. ప్రతి ఏటా

పదకొండు రోజులు ఘనంగా పూజలందుకున్న గణపయ్యను భారీ యంత్రాలతో హుస్సేన్ సాగర్‎లో నిమజ్జనం చేస్తారు. అయితే ప్రతిసారి విగ్రహం మొత్తం నీటిలో మునగక నిమజ్జనం అసంపూర్ణంగా ఉండేది. అంతే కాదు విగ్రహాన్ని తీసుకువచ్చే సమయంలో సాగరతీరంలో పలుసార్లు కుంగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని గుర్తించిన హెచ్ఎండీఏ విగ్రహం సంపూర్ణంగా మునిగేలా నిమజ్జనం చేసేందుకు ఖైరతాబాద్ గణేషుడికి పెద్ద గద్దెను సిద్ధం చేస్తున్నారు. సాగరతీరంలో రూ.2 కోట్ల బడ్జెట్‎తో ఈ గద్దెను నిర్మించనున్నారు.

ఇప్పటికే గద్దె నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. సాగరతీరంలో మట్టి కుంగిపోకుండా ఉండేందుకు వీలుగా 20 అడుగుల లోతు వరకు తవ్వి,అక్కడి నుంచి పైకి ఏడు మీటర్ల ఎత్తులో , 3 మీటర్ల వెడల్పుతో రాళ్లు, జాలీలతో ఉన్న నిర్మాణాన్ని చేపట్టారు. వినాయక చవితి వచ్చే లోపు ఈ గద్దె నిర్మాణాన్ని పూర్తి చేయాలని హెచ్ఎండీఏ లక్ష్యంగా నిర్ధేశించుకుంది. గద్దె నిర్మాణ పనులు పూర్తి కావడానికి మరో నెలరోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

Updated : 1 July 2023 1:35 PM IST
Tags:    
Next Story
Share it
Top