Home > భక్తి > Medaram : మేడారంలో తిరుగువారం పండగ.. భారీగా తరలివచ్చిన భక్తులు

Medaram : మేడారంలో తిరుగువారం పండగ.. భారీగా తరలివచ్చిన భక్తులు

Medaram : మేడారంలో తిరుగువారం పండగ.. భారీగా తరలివచ్చిన భక్తులు
X

మేడారం మహా జాతర వైభవంగా జరిగింది. ఈ నెల 21 నుంచి 24 వరకు జాతర కొనసాగింది. శనివారం సమ్మక్క, సారలమ్మ వనప్రవేశంతో ఈ మహాజాతర మగిసింది. ఈ జాతరకు కోటిన్నర మంది భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇక ఇవాళ తిరుగువారం పండగను నిర్వహిస్తున్నారు. ఆదివాసీలు ఇళ్లను, మందిరాలను శుద్ధి చేసి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తారు. తిరుగువారం పండగ తర్వాత జాతర ముగిసినట్లు పూజారులు అధికారికంగా ప్రకటిస్తారు. ఈ పండుగకు భక్తులు భారీగా తరలివచ్చారు.





ఇప్పటికే మేడారం నుంచి హుండీలను హన్మకొండ తరలించారు. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో గురువారం నుంచి హుండీల లెక్కింపు చేపడతారు. మొత్తం 512 హుండీలను పదిరోజుల పాటు ఈ లెక్కిస్తారు. 2026లో ఈ మహాజాతర మళ్లీ జరగనుంది. మరోవైపు మేడారంలో శుద్ధి ప్రక్రియ కొనసాగుతోంది. మేడారం పరిసరాలను పారిశుధ్య సిబ్బంది క్లీన్ చేస్తున్నారు. ఇక మేడారం జాతరకు వచ్చిన భక్తులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన ఆర్టీసీ సిబ్బందికి ఎండీ సజ్జనార్ అభినందనలు తెలిపారు. అతి తక్కువ సమయంలోనే మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి.. భక్తులకు అసౌకర్యం కలిగించకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు.


Updated : 28 Feb 2024 5:56 AM GMT
Tags:    
Next Story
Share it
Top