Tirumala Srivari Brahmotsavam 2023 : తిరుమల బ్రహ్మోత్సవాలు తేదీలు ఖరారు.. ఎప్పట్నుంచి అంటే..
X
భక్తుల కొంగు బంగారం తిరుమల శ్రీవెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తేదీలను కూడా ఖరారు చేసి బుధవారం ప్రకటించింది. చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను విడుదల చేశారు. ఈ ఏడాది అధిక మాసం రావడంతో రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 18 నుంచి 26వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 14 నుంచి 22 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. భక్తులు ఇబ్బండి పడకుండా అన్ని ఏర్పాట్లూ పూర్తి చేస్తున్నామని, దేనికీ కొరత రాదని ఈవో చెప్పారు. భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తాన్నామని, సిఫార్సు దర్శనాలను రద్దు చేస్తున్నామని తెలిపారు. భక్తులు అధికారులకు సహకరించాలని కోరారు. 18న మొదలయ్యే బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. కాగా, బుధవారం టీటీడీ కొత్త పాలక మండలి నూతన సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.