తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయి ఆదాయం..ఆగుస్టులో కోట్లల్లో కానుకలు
X
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తుతున్నారు. గోవిందను నామాన్ని స్మరిస్తూ తిరుమల చేరుకుంటున్న భక్తులు స్వామివారి దివ్యదర్శనం చేసుకుని హుండీలో కానుకల వర్షం కురిపిస్తున్నారు. గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్కును క్రాస్ చేసింది. ఆగస్టు నెలలో కూడా స్వామివారికి కళ్లు చేదిరే రీతిలో కానుకలు వచ్చాయి. ఈ ఒక్క నెలలోనే 22.25 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందకు తిరుమల చేరుకున్నారు.దీంతో స్వామివారి హుండీకి రూ.120.05 కోట్ల వరకు ఆదాయం లభించింది. అదే విధంగా భక్తులకు టీటీడీ అధికారులు ఆగస్ట్ నెలలో కోటి 9 లక్షల లడ్డూ ప్రసాదాలను విక్రయించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు తిరుమలలో బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది. అదే విధంగా అక్టోబర్ మాసంలో 15 నుంచి 23 తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. అధికమాసం నేపథ్యంలో ఈ సంవత్సరం రెండు సార్లు తిరుమలలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు