Home > భక్తి > Medaram : మేడారం జాతరకు వెళ్తున్నారా.... ఈ మ్యూజియాన్ని మిస్సవ్వకండి

Medaram : మేడారం జాతరకు వెళ్తున్నారా.... ఈ మ్యూజియాన్ని మిస్సవ్వకండి

Medaram  : మేడారం జాతరకు వెళ్తున్నారా.... ఈ మ్యూజియాన్ని మిస్సవ్వకండి
X

ఆదివాసి గిరిజనుల జీవనశైలి ఒకప్పుడు ఎలా ఉండేదో.. జీవన విధానానికై వారు వాడిన వస్తువులు ఎలాంటివో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే కచ్చితంగా మేడారం వెళ్లే భక్తులు అక్కడున్న గిరిజన మ్యూజియాన్ని సందర్శించాల్సిందే. ఈ మ్యూజియం గిరిజనుల జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. వందల ఏళ్ల క్రితం ఆదివాసీలు జీవన విధానంలో వాడిన వస్తువులు, ధరించిన దుస్తులను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది మేడారంలోని గిరిజన మ్యూజియం. మేడారం జాతర ప్రాంతంలో 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 2018లో గిరిజన మ్యూజియం ను ఏర్పాటు చేయడం జరిగింది. రెండు అంతస్తులుగా ఉన్న ఈ మ్యూజియం గిరిజనుల జీవనం శైలిని ప్రతిబింబించేలా రూపొందించడం జరిగింది. మ్యూజియంలోకి వెళ్లగానే మొదట ఆదివాసి వీరుడు కొమరం భీమ్ విగ్రహం కనిపిస్తుంది. తర్వాత మేడారం గిరిజన వనదేవతలైన సమ్మక్క సారలమ్మ జాతర విశేషాలను ప్రతిబింబిస్తుంది.




Updated : 18 Feb 2024 5:36 AM GMT
Tags:    
Next Story
Share it
Top