Home > భక్తి > భక్తులకు గుడ్ న్యూస్.. ఆ రోజున అరుణాచలానికి TSRTC స్పెషల్ బస్సులు

భక్తులకు గుడ్ న్యూస్.. ఆ రోజున అరుణాచలానికి TSRTC స్పెషల్ బస్సులు

భక్తులకు గుడ్ న్యూస్.. ఆ రోజున అరుణాచలానికి TSRTC స్పెషల్ బస్సులు
X

అరుణచలం.. పంచభూత లింగ క్షేత్రాల్లో ఇది ఒకటి. తమిళనాడులో ఉన్న ఈ ఆలయానికి ఏపీ, తెలంగాణ నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్తుంటారు. ఇక ప్రతి నెల పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ జరుగుతుంది. ఈ గిరి ప్రదక్షిణం కోసం వెళ్లే భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ 25న పౌర్ణమిని పురస్కరించుకుని BHEL, MGBS నుంచి టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపుతోంది. ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది.

ఈ ప్యాకేజీలో భాగంగా బస్సులు ఈ 23న BHEL, MGBS నుంచి బయలుదేరి.. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచం చేరకుంటాయి. 25న అరుణాచల గిరి ప్రదక్షిణం ఉంటుంది. 26న తిరిగి హైదరాబాద్ చేరుకుంటాయని టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీధర్ తెలిపారు. భక్తులు www.tsrtconline.inలో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. BHEL నుంచి వెళ్లే బస్సుల్లో ఒక్కరికి రూ.3800, MGBS నుంచి వెళ్లే బస్సుల్లో ఒక్కరికి రూ.3600 రూపాయల ఛార్జ్ ఉంటుందని వివరించారు.


Updated : 19 Jan 2024 6:22 PM IST
Tags:    
Next Story
Share it
Top