Home > భక్తి > శ్రీనివాస హోమం మీరూ చేయొచ్చు.. టీటీడీ నిర్వహణలో...

శ్రీనివాస హోమం మీరూ చేయొచ్చు.. టీటీడీ నిర్వహణలో...

శ్రీనివాస హోమం మీరూ చేయొచ్చు.. టీటీడీ నిర్వహణలో...
X

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. హోమాన్ని సొంతంగా చేసే ఆర్థిక స్తోమత, వనరులు లేని భక్తులకు శ్రీనివాస హోమాన్ని నిర్వహించే అవకాశం కల్పించింది. ఈ నెల 23 నుంచి అలిపిరిలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో ఈ హోమం ప్రారంభమవుతుంది. భక్తులు రూ. 1000 చెల్లించి ప్రత్యక్షంగా గానీ లేకపోతే వర్చువల్‌గా గానీ పాల్గొనొచ్చు. ఈ టికెట్‌పై ఇద్దరిని హోమానికి అనుమతిస్తారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి గురువారం యాగశాల నిర్మాణ పనులు పరిశీలించారు.

‘‘ప్రజలు వ్యక్తిగతం హోమ పూజలు నిర్వహించు కావాలంటే చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. సామాన్య భక్తులు శ్రీనివాస హోమం నిర్వహించుకునే అవకాశం కల్పిస్తున్నారు. అన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా టికెట్లు కొనొచ్చు. హోమంలో పాల్గొన్నవారికి వారికి శ్రీవారి దర్శనం ఉండదు. మొదట ఆన్ లైన్లో 50 టికెట్లు, ఆఫ్ లైన్ లో 50 టికెట్లు విక్రయిస్తాం. వర్చువల్ టికెట్లు ఎంతమందయినా కొనుక్కోవచ్చు. ఎస్వీ వేదవిశ్వవిద్యాలయ పండితుల ఆధ్వర్యంలో యాగం జరుగుతుంది. భక్తుల క్షేమం కోసం ఈ యాగం చేస్తున్నాం. భ‌క్తుల‌ కోరిక మేర‌కు శ్రీవారి పాదాల వ‌ద్ద‌ త‌మ శుభ‌కార్యాలు, విశేష‌మైన రోజుల్లో స్వామివారి అనుగ్ర‌హం కోసం సంక‌ల్పం చెప్పుకుని య‌జ్ఞం నిర్వ‌హించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. త్వ‌ర‌లో శాశ్వ‌త హోమ వేదిక‌ను ఏర్పాటు చేస్తాం’’ అని ధర్మారెడ్డి తెలిపారు.


Updated : 16 Nov 2023 7:34 PM IST
Tags:    
Next Story
Share it
Top