Home > భక్తి > TTD: భక్తులకు అలర్ట్.. మరికాసేపట్లో ఆర్జిత సేవా టికెట్లు విడుదల

TTD: భక్తులకు అలర్ట్.. మరికాసేపట్లో ఆర్జిత సేవా టికెట్లు విడుదల

TTD: భక్తులకు అలర్ట్.. మరికాసేపట్లో ఆర్జిత సేవా టికెట్లు విడుదల
X

శ్రీవారి భక్తులకు అలర్ట్. సెప్టెంబ‌ర్ నెలకు సంబంధించి.. ఈరోజు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్ల కోటాను విడుద‌ల చేయనున్నది టీటీడీ. సెప్టెంబ‌ర్ నెల సంబంధించిన సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌, అష్టాద‌ళ పాద‌ప‌ద్మారాధ‌న ఆర్జిత సేవ‌ల ఆన్‌లైన్ ల‌క్కీ డిప్ కోసం ఈరోజు ఉద‌యం 10 గంట‌ల నుంచి 21వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో న‌మోదు చేసుకోవ‌చ్చు. ల‌క్కీడిప్‌లో టికెట్లు పొందిన భ‌క్తులు.. ఆ తర్వాత డబ్బు చెల్లించి టికెట్ల‌ను ఖ‌రారు చేసుకోవాల్సి ఉంటుంది.

భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో వీటిని బుక్ చేసుకోవచ్చు. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీపీ రిలీజ్ చేయనుంది. సెప్టెంబర్ నెల కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ వర్చువల్ సేవల కోటాను, అదేవిధంగా వాటికి సంబంధించిన దర్శన టికెట్ల కోటాను జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఇక సెప్టెంబర్ నెల ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు, జూన్ 22న శ్రీవారి పవిత్రోత్సవాల సేవాటికెట్లను రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.

Updated : 19 Jun 2023 9:29 AM IST
Tags:    
Next Story
Share it
Top