Home > భక్తి > శ్రీవారి భక్తులకు అలర్ట్.. రూ.300 టికెట్ల విడుదల చేయనున్న టీటీడీ

శ్రీవారి భక్తులకు అలర్ట్.. రూ.300 టికెట్ల విడుదల చేయనున్న టీటీడీ

శ్రీవారి భక్తులకు అలర్ట్.. రూ.300 టికెట్ల విడుదల చేయనున్న టీటీడీ
X

శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. స్వామి వారి ప్రత్యేక దర్శనం కోసం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి రూ.300 టికెట్లను విడుదల తేదీని ప్రకటించారు. జులై 24న ఉదయం 11.00 AM గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించి టికెట్లు రిలీజ్ చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, వికలాంగుల కోటా టికెట్లను విడుదల చేస్తారు. జులై 25న ఉదయం 10.00 గంటలకు ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి అదనపు కోటా టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్లో లాగిన్ అయి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆగస్టు, సెప్టెంబర్ నెలకు సంబంధించి 4000 టికెట్లు, అక్టోబర్ నెలకు సంబంధించి దాదాపు 15 వేల టికెట్లు విడుదల చేయనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.

ఇదిలా ఉంటే జులై 26న మైసూరు మహారాజ జన్మదినం సందర్భంగా.. ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమలలో పల్లకోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామితో పాటు శ్రీదేవి, భూదేవిలను ఊరేగించనున్నారు. కర్ణాటక ప్రభుత్వం తరుపు ప్రతినిధులు దేవతలను ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది.


Updated : 22 July 2023 4:38 PM IST
Tags:    
Next Story
Share it
Top