ఘనంగా వసంత పంచమి వేడుకలు - సరస్వతి ఆలయల్లో పిల్లలకు అక్షరాభ్యాసం
X
సిద్దిపేట జిల్లా వర్గల్ పరిధి శంభూరి కొండలపై కొలువై ఉన్న శ్రీ విద్యా సరస్వతీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన వసంత పంచమి సందర్బంగా హైదరాబాద్ నుంచి అనేక భక్తులు అమ్మవారి దర్శించుకునేందుకు తరలి వెళ్లారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వారు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో బుధవారం తెల్లవారుజామున వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. శ్రీ క్షేత్రం పీఠాధిపతి మధుసూదన నందన సరస్వతి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. అమ్మవారి పుట్టిన రోజు కావడంతో దర్శనం కోసం భక్తులు తెల్లవారుజామునుంచే బారులు తీరారు. దీంతో అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కాగా సరస్వతి అమ్మవారికి వసంత పంచమి చాలా ప్రీతికరమైన రోజు. అక్షరాభ్యాసానికి యోగ్యకరమైనరోజు.. అందుచేత చాలా మంది తమ పిల్లలకు ఈరోజు అక్షరాభ్యాసం చేయిస్తారు. అయితే ఇంటిలో కూడా అక్షరాభ్యాసం చేయించవచ్చునని వేద పండితులు చెబుతున్నారు.
అలాగే తెలంగాణలో నిర్మల్ జిల్లాలో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. నేడు సరస్వతీ దేవి జన్మించిన వసంత పంచమి కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. కాగా, వసంత పంచమి పర్వదినం సందర్భంగా విద్యా ప్రధాయిని సరస్వతి అమ్మవారి రూపంలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. ఆలయ అర్చకులు, వేదపండితులు వేకువజామున సరస్వతి, మహా కాళీ, లక్ష్మీ అమ్మవారికి మంగళ వాయిద్య సేవ, గణపతి పూజ, సుప్రభాత సేవ నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.ఈ వేడుకల్లో ఎలాంటి అపశ్రుతి చోటు చేసుకోకుండా పోలీసు శాఖ భారీ బందోబస్తు నిర్వహిస్తుంది. ఆలయం, గోదావరి స్నాన ఘట్టాలు, పార్కింగ్ స్థలాల దగ్గర అదనపు భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆలయ ప్రధాన ద్వారాల దగ్గర మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో నిఘా వేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక, వసంత పంచమి వేడుకల్లో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం నుంచే భక్తులు బాసరకు భారీగా తరలి వచ్చారు. నిన్న సాయంత్రానికి ఆలయ అతిథి గృహాలు, ప్రైవేటు లాడ్జీలు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. బాసరకు వచ్చే బస్సులు, రైళ్లు భక్తులతో కిటకిటలాడాయి. బాసర ఆలయానికి వచ్చే భక్తులకు నిత్య అన్నదానం నిరంతరాయం కొనసాగుందని ఆలయ ఈఓ విజయరామారావు వెల్లడించారు.
Vasantha Panchami celebrations, Basara Saraswati Temple, Nirmal District, Wargal temple, siddipet dist,
Literacy for children, Today is Vasantha Panchami Special decoration for Devi temples Vasantha Panchami, saraswathi Devi Temples, Devi temples, Basant Panchami 2024, Saraswati Puja vidhi, shubh muhurat, important rituals, Devotional, Bhakti, Viral, spiritual, Basant Panchami, festival, culture, special, Cm revathreddy, Minister konda surekha, former minister Indrakaran Reddy.