Home > భక్తి > మహిషాసుర మర్ధని, రాజరాజేశ్వరీ అలంకారాల్లో అమ్మవారు

మహిషాసుర మర్ధని, రాజరాజేశ్వరీ అలంకారాల్లో అమ్మవారు

మహిషాసుర మర్ధని, రాజరాజేశ్వరీ అలంకారాల్లో అమ్మవారు
X

శరన్నవరాత్రి మహోత్సవాల్లో తొమ్మిదో రోజున శ్రీ మహిషాసురమర్దనీదేవి అవతారంలో విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమించారు. అమ్మవారి నవ అవతారాల్లో మహిషాసురమర్దనిని మహోగ్రరూపంగా భక్తులు భావిస్తారు. అమ్మ మహిషాసురుడిని సంహరించిన ఆశ్వయుజ శుద్ధ నవమిని ‘మహర్ణవమి’గా ఈ రోజును జరుపుకొంటారు. ‘చండీ సప్తశతి’ ప్రకారం దుర్గాదేవి అష్టభుజాలతో, సింహవాహినిగా మహిషాసురుడి సేనాపతులతో పాటు రాక్షసులందరినీ సంహరించింది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో మహిషాసురుణ్ణి చంపి, అదే స్వరూపంతో ఇంద్రకీలాద్రి మీద స్వయంభువుగా దుర్గమ్మ తల్లి వెలసింది.

బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి సహజ స్వరూపం కూడా ఇదే.. సింహవాహనాన్ని అధిష్ఠించి, ఆయుధాలను ధరించిన చండీదేవి సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా కనకదుర్గదేవీ అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. అయితే, అమ్మవారు మధ్యాహ్నం 12 గంటల నుంచి మహిషాసుర మర్ధిని అవతారంలో, 2 గంటల నుంచీ రాజరాజేశ్వరీ దేవి అవతారంలోనూ దర్శనం ఇస్తారు. ఒకేరోజు రెండు తిథులు రావడంతో ఈ విధంగా రెండు అవతారాలలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. దీంతో అమ్మవారిని దర్శించుకోవడానికి ఇంద్రకీలాద్రికి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. విజయదశమి నాడు అమ్మవారిని దర్శించుకుంటే అన్ని విజయాలు చేకూరతాయని భక్తుల విశ్వాసం.

ఇవాళ సాయంత్రం కృష్ణానదిలో ఉత్సవమూర్తులను పోలీసులు ఊరేగింపుగా దుర్గాఘాట్‌కు తీసుకెళ్తారు. గంగా పార్వతి సమేత మల్లేశ్వరుల స్వామివార్లు హంసవాహాణంపై నదివిహారం చేస్తారు. దసరా ఉత్సవాలు ముగుస్తుండడంతో ఇంద్రకీలాద్రికి భవానీ భక్తుల రాక పెరిగింది. దసరా ముగిసిన తర్వాత కూడా రెండు రోజుల పాటు భవానీలు తరలిరానున్నారు.




Updated : 23 Oct 2023 12:32 PM IST
Tags:    
Next Story
Share it
Top