Home > భక్తి > శ్రావణమాసంలో మాంసాహారం ఎందుకు తినరో తెలుసా?

శ్రావణమాసంలో మాంసాహారం ఎందుకు తినరో తెలుసా?

శ్రావణమాసంలో మాంసాహారం ఎందుకు తినరో తెలుసా?
X

భారతీయులకు భక్తి భావాలు ఎక్కువే. ప్రతీదాన్ని నియమ నిబంధనలు పెట్టుకుని.. ఆచారాలు ఫాలో అవుతూ పండుగలు జరుపుకుంటారు. అందులో ముఖ్యంగా శ్రావణ మాసం ఒకటి. ఈ మాసంలో ప్రజలంతా చాలా పవిత్రంగా ఉంటారు. ప్రతి సోమవారం గుడికెళ్లి శివున్ని ఆరాధిస్తారు. అంతేకాకుండా రాఖీ, శ్రీ కృష్ణ జన్మాష్టమీ, నాగుల పంచమీ, వినాయక చవితి.. ఇలా పండుగలన్నీ ఈ నెలతోనే మొదలవుతాయి. ఈ నెలలో చాలామంది ఆధ్యాత్మిక కారణాలతో మాంసాహారానికి దూరంగా ఉంటారు. శాకాహారానికే ప్రాధాన్యం ఇస్తారు. పురాణాల్లో కూడా శ్రావణమాసంలో మాంసాహారానికి దూరంగా ఉండాలని సూచించారు. దీని వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందని అంటున్నారు. అవేంటంటే..

వర్షాకాలంలోనే శ్రావణం వస్తుంది. అంతేకాదు వర్షాకాలంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు తినొద్దని అంటున్నారు. వాటిలో ముందు వరుసలో ఉండేది మాంసాహారం. మాసంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ కాలంలో సూర్యరష్మి లేకపోవడం వల్ల ఫంగస్ పెరిగి ఆహార పదార్థాలు కుళ్లిపోతాయి. మాంసాహారం జీర్ణం కావడానికి ఎక్కువ టైం పడుతుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేయదు. జీర్ణ క్రియ బలహీనంగా ఉంటే.. మాంసం అరగక పేగుల్లో బ్యాక్టీరియా తయారవుతుంది. దాంతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇదే నెలలో జంతువులు ఎక్కువగా ప్రసవిస్తాయి. ఈ కారణంతో వాటిని చంపడం మంచిది కాదన్న కారణంతో కూడా మాంసం తీసుకోరాదని చెప్తుంటారు.




Updated : 17 Aug 2023 5:50 PM IST
Tags:    
Next Story
Share it
Top