Lakshmi Narayan Raj yoga : లక్ష్మీనారాయణ యోగంతో ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం
X
లక్ష్మీనారాయణ యోగంతో ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభంఫిబ్రవరి నెలలో మకరరాశిలోకి శుక్రుడు, బుధుడు ప్రవేశించనున్నారు. ఆ రెండు గ్రహాల కలయిక వల్ల ద్వాదశ రాశులపై శుభ ప్రభావం పడుతోంది. ఆ రాశుల వారికి నేడు లక్ష్మీ నారాయణ యోగం కూడా ఏర్పడనుండటంతో వారికి ఇక అన్నీ శుభాలే కలుగుతాయి. ముఖ్యంగా నాలుగు రాశులపై లక్ష్మీదేవి, విష్ణుమూర్తిల అనుగ్రహం కలగనుంది. మరి అందులో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి.
మిధున రాశి
ఈ రాశి వారికి భారీగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అలాగే మొండి బకాయిలు కూడా వసూలు కానున్నాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారంలో లాభాలు భారీగా పెరుగుతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి లక్ష్మీనారాయణ యోగ ప్రభావం వల్ల డబ్బులకు కొదవ ఉండదు. కష్టాలు తొలగిపోతాయి. జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారులకు శుభాలు కలుగుతాయి. రెండు మూడు మార్గాల్లో పెట్టుబడులు పెడుతారు. కుటుంబంలో శుభవార్తలు వింటారు. అధిక మొత్తంలో డబ్బులను పొందుతారు.
ధనస్సు రాశి
లక్ష్మీ కటాక్షం వల్ల ఈ రాశివారికి జీవితంలో ఐశ్వర్యం బాగా పెరుగుతుంది. కెరీర్ పరంగా ఊహించని విజయాలను పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి నుంచి శుభవార్త వింటారు.
మకర రాశి
లక్ష్మీనారాయణ యోగం ఈ రాశిలోనే ఏర్పడనుండటం వల్ల ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. కొత్త కారు కొనే అవకాశం ఉంది. వ్యాపారానికి సంబంధించి పెద్ద పెద్ద ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థికంగా లాభాలను పొందుతారు. బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు అందుతాయి.