పవర్‌గ్రిడ్(PGCIL)లో ట్రైనీ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి
నెలకు రూ.70 వేల జీతంతో ట్రైనీ ఉద్యోగాలు
Lenin | 26 Nov 2023 12:50 PM IST
X
X
ఐటీఐ చేసి ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) 203 జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 22న ప్రారంభమవగా, డిసెంబర్ 12న ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో మొత్తం 203 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులపై ఉద్యోగం పొందాలని ఆసక్తి ఉన్నవారు కింద ఇచ్చిన పాయింట్లను పరిశీలించగలరు.
రిక్వైర్‌మెంట్ ఇదే..
- అర్హత: ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
- వయోపరిమితి: 12.12.2023 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
- అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్–సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
- అప్లై ప్రొసెస్: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- సెలక్షన్ ప్రాసెస్: సీబీటీ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
- జీతం: ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ పీరియడ్‌లో నెలకు రూ.18,500 స్టైపెండ్‌గా ఇస్తారు. ఆ నెలకు రూ.21,500-రూ.74000 పే స్కేల్ అమలుచేస్తారు.
ఇలా అప్లై చేయండి..
- అభ్యర్థులు PGCIL అధికారిక వెబ్సైట్ https://www.powergrid.in/ ఓపెన్ చేయాలి.
- Careers సెక్షన్లోకి వెళ్లి, జాబ్ ఆపర్చ్యూనిటీస్ చూసుకోవాలి.
- Recruitment of Junior Technician Trainee లింక్‌పై క్లిక్ చేసి ఓపెన్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
- అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- తరువాత అన్ని వివరాలు సరిచూసుకుని అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
- రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు..
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 నవంబర్ 22
- దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 డిసెంబర్ 12
- పరీక్ష తేదీ : 2024 జనవరి
Updated : 26 Nov 2023 12:50 PM IST
Tags: POWERGRID Corporation of India Limited online registration process PGCIL Recruitment 2023 apply for PGCIL Junior Technician Trainee Recruitment official website at powergrid.in official notification November 22 December 12 CBT exam January 2024 Maharatna Public Sector Enterprise Ministry of Power issued the notification
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire