1207 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇంటర్ పాస్ అయితే చాలు..
X
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ - 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1207 స్టెనోగ్రాఫర్ ( Grade C,D) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టైపింగ్ తెలిసి ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
మొత్తం పోస్టులు: 1207
పోస్ట్ పేరు: స్టెనోగ్రాఫర్
అర్హత: ఇంటర్ పాసై ఉండాలి. స్టెనోగ్రఫీలో నైపుణ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01-08-2023 నాటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్- సి పోస్టులకు 18-30 ఏళ్లు, గ్రేడ్- డి పోస్టులకు 18-27 ఏళ్లు మించకూడదు. వివిధ కేటగిరీల వారీగా నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు ఉంటాయి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్ అంశాల్లో ప్రశ్నలుంటాయి.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2-08-2023
చివరి తేదీ: 23-08-2023
వెబ్‌సైట్: https://ssc.nic.in/