Home > విద్య & ఉద్యోగాలు > Group 1 Preliminary Exam:మరికాసేపట్లో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌.. ఈ రూల్స్‌ మస్ట్‌..

Group 1 Preliminary Exam:మరికాసేపట్లో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌.. ఈ రూల్స్‌ మస్ట్‌..

Group 1 Preliminary Exam:మరికాసేపట్లో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌.. ఈ రూల్స్‌ మస్ట్‌..
X



మరికాసేపట్లో జరగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సర్వం సిద్ధమైంది. మొత్తం 503 గ్రూప్‌-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి ఈ ఆదివారం ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. నిరుడు అక్టోబర్‌ 16న గ్రూప్‌-1 ప్రిలిమినరీ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పరీక్షను రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ.. గతంలో తలెత్తిన గందరగోళ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లోని 994 సెంటర్లలో 3,80,081 మంది పరీక్ష రాస్తున్నారు. ఈ పరీక్షకు కలెక్టర్లను జిల్లా అథారిటీ ఆఫీసర్లుగా, అడిషనల్‌ కలెక్టర్లను చీఫ్‌ కో-ఆర్డినేటింగ్‌ ఆఫీసర్లుగా నియమించడంతోపాటు 994 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, 994 మంది లైజన్‌ ఆఫీసర్లు, 310 రూట్‌ ఆఫీసర్లను నియమించింది.

గతంలో జరిగిన లోటుపాట్లు, గందరగోళం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులకు, పరీక్ష నిర్వహణ సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సీఎస్ శాంతికుమారి, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి వేర్వేరుగా అధికారులతో టెలీకాన్ఫరెన్సులు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

పరీక్ష రాసే అభ్యర్థులు తెలుసుకోవాల్సిన అంశాలు :

•అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్‌ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. అదికూడా ఏ4 సైజులో ఉండాలి. అవకాశం ఉంటే కలర్‌ జిరాక్సు తీసుకెళ్లడం మంచిది.

•హాల్‌టికెట్‌లో ఫొటో లేకపోయినా? సరిగా ముద్రణ కాకపోయినా? గెజిటెడ్‌ ఆఫీసర్‌తో ధ్రువీకరణ తీసుకోవాలి. దీనితోపాటు మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలపై సంతకం చేయించుకుని పరీక్ష కేంద్రంలో చీఫ్‌ సూపరింటెండెంట్‌ను సంప్రదించాలి.

•పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటర్‌ ఐడీ కార్డు, ఆ ధార్‌ కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

• గోరింటాకు, టాటూలతో పరీక్షకు వెళ్లొద్దు. చేతులపై అవి ఉంటే థంబ్‌ తీసుకునేటప్పుడు ఇబ్బంది వస్తుంది.

•అభ్యర్థులు బూట్లు, సాక్సులు ధరించకూడదు. చెప్పులే ధరించాలి.

•పరీక్ష ఉదయం 10.30కి ప్రారంభమవుతుంది. ఉదయం 8.30 నుంచి 10.15 గంటల వరకే అనుమతిస్తారు.

•దివ్యాంగుల కోటాలో గ్రూప్‌-1కు దరఖాస్తు చేసిన అభ్యర్థులంతా సదరం సర్టిఫికెట్‌ను తీసుకెళ్లాలి.

•వినికిడి యంత్రాలు తీసుకెళ్లే ధ్రువీకరణ పత్రం వెంట తీసుకెళ్లాలి. అప్పుడే వినికిడి యంత్రాలను అనుమతిస్తారు.

•కంటి సమస్య ఉంటే కళ్లజోళ్లు అనుమతిస్తారు. కూలింగ్‌ క్లాసులు అనుమతించరు.

•కేంద్రాల్లో తాగునీటి ఏర్పాట్లు ఉంటాయి. వాటర్‌బాటిళ్లు అనుమతించరు.

•మంగళసూత్రం మినహా ఇతర ఏ ఆభరణాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

•పరీక్షలో పెన్సిల్‌ ఉపయోగించరాదు. ఎటువంటి స్కెచ్‌ పెన్లు, కలర్‌ పెన్సిళ్లకు అనుమతి లేదు. కేవలం బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పాయిం ట్‌ పెన్నుతో మాత్రమే బబ్లింగ్‌ చేయాలి.

• వైట్‌నర్‌, రబ్బర్‌, చాక్‌ పౌడర్‌, బ్లేడ్‌.. ఇలాంటివి పరీక్షలో ఉపయోగించరాదు. ఒకవేళ ఎవరైనా ఓఎంఆర్‌ షీట్‌పై వీటిని ఉపయోగిస్తే ఆ పేపర్‌ను మూల్యాంకనం చేయరు.

•ఒకరి బదులు మరొకరు పరీక్ష రాసినా.. ఎలాంటి అవకతవకలకు పాల్పడిన క్రిమినల్‌ కేసు ఉంటుంది.

•మాస్‌ కాఫీయింగ్‌కు పాల్పడిన వారు భవిష్యత్తులో ఉద్యోగ నియామక పరీక్షలు రాయకుండా డీబార్‌ చేస్తారు.

గతంలో జరిగిన పరీక్షలో బబ్లింగ్ పొరపాట్లు వల్ల వందల మంది అనర్హులయ్యారు. ఈసారి ఆ పొరపాట్లను చేయవద్దని కమిషన్‌ సూచించింది.




Updated : 11 Jun 2023 2:22 AM GMT
Tags:    
author-thhumb

Krishna

సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.


Next Story
Share it
Top