Home > విద్య & ఉద్యోగాలు > కాసేపట్లో గ్రూప్ 4 ఎగ్జామ్.. అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ కీలక సూచనలు..

కాసేపట్లో గ్రూప్ 4 ఎగ్జామ్.. అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ కీలక సూచనలు..

కాసేపట్లో గ్రూప్ 4 ఎగ్జామ్.. అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ కీలక సూచనలు..
X

కాసేపట్లో గ్రూప్ 4 ఎగ్జామ్ ప్రారంభంకానుంది. ఉదయం, మధ్యాహ్నం జరగనున్న ఈ పరీక్షకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. పేపర్‌-1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, పేపర్‌-2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. మొత్తం 9.51 లక్షల మంది గ్రూప్‌-4కు దరఖాస్తు చేసుకోగా.. 9లక్షల మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ క్రమంలో అభ్యర్థులకు TSPSC కీలక సూచనలు చేసింది.

ఉదయం 8గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించగా.. పరీక్షకు 15నిమిషాల ముందే గేట్లు మూసివేస్తారు. వాచ్, హ్యాండ్‌ బ్యాగ్‌, పర్సులు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఎగ్జామ్ హాలులోకి నిషేధం. అభ్యర్థులు షూస్ వేసుకొని రావొద్దని... చెప్పులు వేసుకుంటే అనుమతిస్తారని TSPSC సూచించింది. హాల్‌టికెట్‌, ప్రశ్నపత్రం నంబరు సరిగా రాయకున్నా, బ్లూ/ బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌కాకుండా ఇంక్‌పెన్‌, జెల్‌పెన్‌, పెన్సిల్‌ ఉపయోగించినా ఓఎంఆర్‌ పత్రం చెల్లుబాటు కాదు. మధ్యాహ్నం 2.15 కు గేట్లు మూసివేయనుండగా.. అంతకంటే ముందే అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాలని బోర్డు సూచించింది.

Updated : 1 July 2023 9:15 AM IST
Tags:    
Next Story
Share it
Top