Home > Featured > వందల్లో రైలు ప్రమాదాలు.. రాజీనామా చేసింది ఎంతమంది అంటే..

వందల్లో రైలు ప్రమాదాలు.. రాజీనామా చేసింది ఎంతమంది అంటే..

మిగతావాళ్లవి అక్కర్లేదన్నారు.

వందల్లో రైలు ప్రమాదాలు.. రాజీనామా చేసింది ఎంతమంది అంటే..
X

మనదేశంలో స్వతంత్రం వచ్చినప్పట్నుంచి కొన్ని వేల రైలు ప్రమాదాలు జరిగాయి. వందల మంది చనిపోయిన పెద్ద ప్రమాదాలు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. నాణ్యమైన సర్వీసులకు, అందుబాటు ధరలకు పెట్టింది పేరైన భారతీయ రైల్వేలో తరచూ కొన్ని వైఫల్యాలు నమోదవుతుంటాయి. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నా భారీ నెట్ వర్క్ కావడంతో ఎక్కడ అక్కడ పట్టాలపై మృత్యుఘోష వినిపిస్తూనే ఉంటుంది. ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొట్టిన విషాదం అలాంటింది. ప్రమాదానికి బాధ్య వహిస్తూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. అయితే రాజీనామాతో సమస్య పరిష్కారం కాదని, ఇదివరకు కూడా కొందరు రైల్వే మంత్రులు రాజీనామా చేసినా ప్రయోజనం లేకపోయిందని అంటున్నారు. మరి ఇంతకూ గతంలో రాజీనామా చేసిన మంత్రలెవరో తెలుసుకుందాం.

లాల్ బహదుర్ శాస్త్రి

దేశ రెండో ప్రధాని లాల్ బహదుర్ శాస్త్రి 1956లో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు నవంబరులో తమిళనాడులోని అరియళూరు వద్ద జరిగిన ప్రమాదంలో 142 మంది ప్రయాణికులు మృతి చెందారు. నైతిక బాధ్యత తనదేనని శాస్త్రి రాజీనామా చేశారు. నెహ్రూ దాన్ని ఆమోదించినా వేరే శాఖ ఇచ్చారు.

నితీశ్ కుమార్

1999 ఆగస్టులో పశ్చిమ బెంగాల్లోని గైసాల్‌లో జరిగిన రైలు ప్రమాదంలో 285 మంది బలయ్యారు. నాటి రైల్వే మంత్రి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. అప్పటి ప్రధాని వాజపేయి ఆమోదించారు.

చేశారు కానీ..

ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2000లో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రెండు భారీ రైలు ప్రమాదాలు జరడంతో ఆమె రాజీనామా చేశారు. అయితే వాజపేయి తిరస్కరించి పదవిలో కొనసాగించారు. 2017 సెప్టెంబర్‌లో సురేశ్ ప్రభు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు

సురేశ్‌ ప్రభు: నాలుగు రోజుల వ్యవధిలో రెండు రైళ్లు (కైఫియత్‌ ఎక్స్‌ప్రెస్‌, పూరీ-ఉత్కళ ఎక్స్‌ప్రెస్‌) ప్రమాదాలకు గురికావడంతో 2016, 2017లో మూడు భారీ ప్రమాదాలు జరిగాయి. ఇందోర్-రాజేంద్రనగర్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడతో 154 మంది చనిపోగా సురేశ రాజీనామా చేశారు. అయితే మోదీ తిరస్కరించారు.

Updated : 4 Jun 2023 11:55 AM IST
Tags:    
Next Story
Share it
Top