Home > Featured > పారిస్ లో ఫ్రాంక్ లే కాదూ రూపాయిలూ చెల్లుతాయి

పారిస్ లో ఫ్రాంక్ లే కాదూ రూపాయిలూ చెల్లుతాయి

పారిస్ లో ఫ్రాంక్ లే కాదూ రూపాయిలూ చెల్లుతాయి
X

ప్రతీ దేశానికీ ఒక్కో కరెన్సీ ఉంటుంది. అవి కేవలం ఆ దేశాల్లోనే చెల్లుబాటు అవుతాయి. అలాగే ఇండియన్ కరెన్సీ రూపాయలు కేవలం మన దేశంలోనే చెల్లుతాయి. మనం వేరే దేశంలో డబ్బులు ఖర్చుపెట్టాలంటే అక్కడి కరెన్సీలోకి మన రూపాయలను మార్చుకోవలసిందే. అయితే ఫ్రాన్స్ లో మాత్రం ఇక మీదట అలా చేయక్కర్లేదు. ఇకపై పారిస్‌లో మన రూపాయి చెల్లుబాటు కానుంది. అలాగే ఫ్రాన్స్ లో మన యూపీఐ సేవలు కొనసాగనున్నాయి.

ప్రస్తుతం భారత్ లో డిజిటల్ మనీ హవా నడుప్తోంది. క్యాష్ ట్రాన్జాక్షన్స్ అన్నీ యూపీఏ, పేటీమ్ లాంటి వాటిల్లోనే జరుగుతున్నాయి. అవి ఎంతలా జరుగుతన్నాయి అంటే గతేడాది డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. కొత్త ఆవిష్కరణలతో భారత్ నగదు రహిత ఆర్ధిక వ్యవస్థగా మారుతోంది. ఈ నేపథ్యంలో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. యూపీఏ సేవలను విదేశాలకు విస్తరించు పనులను చేపట్టింది. అందులో భాగంగానే ఫ్రాన్స్ లో యూపీఏ సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా భారత ప్రధాని నరేంద్రమోడీనే ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. మోదీ పారిస్‌లోని ప్రవాసీ భారతీయులతో గురువారం సమావేశమయ్యారు. భారత్‌లో విజయవంతంగా అమలవుతున్న నగదు చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(UPI) సేవలు ఇక ఫ్రాన్స్‌లోనూ ప్రారంభం కానున్నాయని ఆయన తెలిపారు. ఫ్రాన్స్‌లో యూపీఐ చెల్లింపుల సేవలను ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని...త్వరలోనే ఈఫిల్‌ టవర్‌ వద్ద ఈ సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ ప్రాంతాన్ని చూసేందుకు వచ్చే భారత పర్యాటకులు భారత కరెన్సీని ఇక్కడ చెల్లింపుల కోసం వాడవచ్చని ప్రధాని పేర్కొన్నారు.

ఇప్పటివరకు యూఏఈ, భూటాన్‌, నేపాల్‌ లలో వంటి దేశాల్లోనూ యూపీఐ సేవలు కొనసాగుతున్నాయి. గతేడాది ఎన్పీసీఐ, ఫ్రాన్స్‌లు లైరా అని పిలిచే ఆన్‌లైన్ చెల్లింపు వ్యవస్థ... ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. అలాగే యూపీఐ, సింగపూర్‌కి చెందిన PayNow మధ్య కూడా ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల్లోని వినియోగదారులు దీని ద్వారా లావాదేవీలకు అనుమతించారు. అమెరికా, ఐరోపా, పశ్చిమ ఆసియా దేశాల్లో ఈ చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ఎన్‌పీసీఐ చర్చలు జరుపుతోంది.



Updated : 14 July 2023 2:37 PM IST
Tags:    
author-thhumb

Veerendra Prasad

వీరేందర్ మైక్ టీవీ వెబ్‌సైట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌(సబ్ ఎడిటర్)గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో(V6, T News) రాజకీయం, లైఫ్ స్టైల్, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.


Next Story
Share it
Top