Home > Featured > అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం

అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం

పెట్రోల్ ట్యాంకును ఢీకొట్టి..

అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం
X

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి రోడ్డు ప్రమాదంలో బలయ్యాడు. న్యూజెర్సీలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు గుర్రపు శైలేష్ (21) సజీవ దహనమయ్యాడు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బడా భీమ్‌గల్ గ్రామానికి చెందిన శైలేష్ బయోమెడికల్ ఇంజినీరింగ్ చేయడానికి అమెరికా వెళ్లాడు. అతడు ప్రయాణిస్తున్న కారు సెల్టన్ ప్రాంతంలో వేగంగా పెట్రోల్‌ ట్యాంకును ఢీకొంది. తర్వాత మంటలు రేగగా శైలేష్ వాటిలో చిక్కుకుపోయాడు. శైలేష్ మృతితో స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అతని మృతదేహాన్ని తీసుకురావడానికి సాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. శైలేష్ గత ఏడాదే బీటెక్ పూర్తి చేశాడు. అతని తండ్రి సత్యం గతంలో గల్ఫ్ దేశాల్లో పనికి వెళ్లాడు.

Updated : 4 Jun 2023 7:13 AM IST
Tags:    
Next Story
Share it
Top