Home > Featured > ఫోర్ కొట్టి సెలబ్రేట్ చేసుకున్న స్టార్ బ్యాట్స్ మన్ విరాట్

ఫోర్ కొట్టి సెలబ్రేట్ చేసుకున్న స్టార్ బ్యాట్స్ మన్ విరాట్

ఫోర్ కొట్టి సెలబ్రేట్ చేసుకున్న స్టార్ బ్యాట్స్ మన్ విరాట్
X

విండీస్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఆటగాళ్ళు దంచేస్తున్నారు. రెండోరోజు ఆటలో సెంచరీలతో చెలరేగిపోయారు. యశస్వి, రోహిత్ లు సెంచరీలతో అందరినీ ఆకట్టకున్నారు. మరోవైపు జట్టులోని స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ కూడా అందరి దృష్టిని ఆకర్షించాడు.

విరాట్ కోహ్లీ క్రీజ్ లో ఉన్నాడంటే బౌండరీల వర్షం కురవాల్సిందే. దూకుడు ఆటకు పెట్టింది పేరైన విరాట్ బౌండరీ కొట్టకుండా ఉండడం ఇప్పటివరకు ఏ మ్యాచ్ లోనూ జరగలేదు. అలాంటి స్టార్ బ్యాట్స్ మన్ నిన్నటి మ్యాచ్ లో చాలా సేపు ఒక్క ఫోర్ కూడా కొట్టలేదు. ఒక్క ఫోర్ కొట్టడానికి 81 బంతులు తీసుకున్నాడు. యశస్వితో కలిసి ఆటను ముందుకు పరుగెత్తించిన విరాట్ ఇలా ఫోర్ కొట్టకుండా ఉండడం ఇదే మొదటిసారి. ఇది అతనికే చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం అయి ఉండొచ్చు. అందుకే ఫోర్ కొట్టగానే డగౌట్ వైపు పిడికిలి చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. సాధారణంగా ఆఫ్ సెంచురీ, సెంచురీలు చేసినప్పుడు ఇలాంటివి చేస్తారు. కానీ నిన్నటి మ్యాచ్ లో విరాట్ ఫోర్ కొట్టింనందుకు చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. వారికన్ వేసిన 110వ ఓవర్ లో విరాట్ కవర్ డ్రైవ్ తో బౌండరీ రాబట్టాడు.

యశస్వి జైస్వాల్ తో కలిసి విరాట్ ఇన్నింగ్స్ ను ముందుకు పరుగెత్తించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 205 బంతుల్లో 72 పరుగులు చేశారు. మొదటి బంతి నుంచీ విరాట్ చాలా నిదానంగా, నిలకడగా ఆడాడు. రిస్కీ షాట్లతో అవుట్ అయిపోకుండా జాగ్రత్తపడ్డాడు.

మొదటి టెస్ట్ లో ప్రస్తుతం భారత్ 312/2 స్కోరుతో కొనసాగుతోంది. వెస్టీండీస్ కంటే 162 పరుగుల ఆధిక్యంలో ఉంది. విండీస్ మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆలౌట్ అయింది.

Updated : 14 July 2023 1:18 PM IST
Tags:    
author-thhumb

Veerendra Prasad

వీరేందర్ మైక్ టీవీ వెబ్‌సైట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌(సబ్ ఎడిటర్)గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో(V6, T News) రాజకీయం, లైఫ్ స్టైల్, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.


Next Story
Share it
Top