ఈ పాస్ పోర్ట్ ఉంటే చాలు బోలెడు దేశాలు చుట్టేయొచ్చు
X
దేశం దాటాలంటే పాస్ పోర్ట్ తప్పనిసరిగా ఉండాలి. చాలా దేవాలకు వీసాలు కూడా ఉండాలి. కానీ దేశాల పాస్ పోర్ట్ లు ఉంటే చాలు వీసాలు లేకుండా వేరే దేశాలకు వెళ్ళొచ్చు. అలాంటి వాటిల్లో సింగపూర్ పాస్ పోర్ట్ అన్నింటికంటే శక్తివంతమైనదిగా నిలిచింది.
మనం ఏ దేశం వారమో చెప్పే వాటిల్లో పాస్ పోర్ట్ ఒకటి. ఎక్కడకు వెళ్ళాలన్ని ఇది తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇది ఉంటేనే మిగతా దేశాలు వెళ్ళడానికి అనుమతినిచ్చే వీసా వస్తుంది. అయితే అన్ని దేశాలకూ ఒకటే పాస్ పోర్ట్ ఉండదు. ఒక్కో దేశానికి ఒక్కోటి ఉంటుంది. అందులో కొన్ని దేశాలవి చాలా పవర్ ఫుల్ పాస్ పోర్ట్ లుగా గుర్తింపబడుతున్నాయి. ఇప్పటివరకు జపాన్ దేశపు పాస్ పోర్ట్ అన్నింటికంటే పవర్ ఫుల్ గుర్తింబడింది. కానీ ఇప్పుడు జపాన్ ను వెనక్కి నెట్టేసి సింగపూర్ దాని స్థానాన్ని ఆక్రమించేసింది. సింగపూర్ పాస్ సోర్ట్ ఉంటే 193 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. వీసా ఆన్ అరైవల్ అనే పద్ధతిలో ఆ దేశాల్లో తిరగొచ్చు. సింగపూర్...తరువాత జపాన్(192), దక్షిణ కొరియాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. జర్మనీ, స్పెయిన్ దేశాలు 190 వీసా స్కోర్ తో మూడవ స్థానంలో నిలవగా, ఫిన్ ల్యాండ్, ఇటలీ, లక్సమ్ బర్గ్ దేశాలు 189 వీసా స్కోర్ తో నాల్గవ స్థానంలో నిలిచాయి. ఇక ఐదవ స్థానంలో ఆస్ట్రియా, డెన్మార్క్, నెదర్లాండ్స్, స్వీడన్ దేశాలు నిలిచాయి. ఇవి 188 వీసా స్కోరును కలిగి ఉన్నాయి.
గతేడాదితో పోలిస్తే భారత్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకుంది. 85వ స్థానం నుంచి 80వ స్థానానికి చేరుకుంది. మన పాస్‌పోర్టుతో 57 దేశాల్లో పర్యటించవచ్చు. అమెరికా, లిథువేనియాలు మాత్రం 184 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణించే వీలుతో ఎనిమిదో ర్యాంక్‌లో నిలిచాయి. లాట్వియా, స్లోవేకియా, స్లోవేనియాలు తొమ్మిదో స్థానంలో నిలిచాయి. ఈ పాస్‌పోర్టులతో 183 దేశాల్లో తిరిగేందుకు అవకాశం పొందవచ్చు. పాకిస్థాన్ 100వ స్థానంలో నిలిచింది. ఇక చివరి స్థానంలో తాలిబాన్ అధికారంలో ఉన్న అఫ్గానిస్థాన్ నిలిచింది. ఈ పాస్‌పోర్టు ఉన్నవారు కేవలం 27 దేశాలకు మాత్రమే వీసా లేకుండా వెళ్లవచ్చు.
ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) సమాచారం ఆధారంగా హెన్లీ&పార్ట్‌నర్స్ పరిశోధకుల బృందం ప్రతిఏటా ఈ జాబితా రూపొందిస్తుంది. తాజాగా హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ పేరుతో ఈ జాబితా విడుదల చేసింది.
Veerendra Prasad
వీరేందర్ మైక్ టీవీ వెబ్‌సైట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్(సబ్ ఎడిటర్)గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో(V6, T News) రాజకీయం, లైఫ్ స్టైల్, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.