Home > ప్రత్యేక కథనాలు > నెల ముందుగానే బిగ్బాస్ సీజన్ 7..!

నెల ముందుగానే బిగ్బాస్ సీజన్ 7..!

నెల ముందుగానే బిగ్బాస్ సీజన్ 7..!
X

బుల్లి తెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ రాబోతోంది. ఎన్ని మీమ్స్, ట్రోల్స్ వచ్చినా.. బిగ్ బాస్ చూసేవాళ్లకు కొదవలేదు. ఈ రియాల్టీ షో ఎన్ని సీజన్స్ వచ్చినా ఫ్యాన్స్ లో ఆ క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. కంటెస్టెంట్స్ గా ఎవరెవరు వస్తారంటూ.. ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రోమో విడుదలైనప్పటి నుంచి టీవీలకు అతుక్కుపోతుంటారు. ప్రస్తుతం సీజన్ 7 కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే హోస్ట్ గా నాగార్జున వస్తున్నాడని తెలుపుతూ ఓ గ్లింప్స్ ను వదిలారు. సీజన్ 7 కు సంబంధించిన లోగో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పలువురు సెలబ్రిటీలు, యూట్యూబర్లు ఈ సీజన్ లో రాబోతున్నారని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

ఈ క్రమంలో మరో కొత్త ప్రచారానికి తెరలేపారు. అదేంటంటే.. మామూలుగా బిగ్ బాస్ సీజన్ సెప్టెంబర్ లో మొదలవుతుంది. కానీ, ఈసారి కాస్త ముందుగానే అంటే.. జులై చివరి వారంలో గానీ లేదా ఆగస్టు నెలలో గానీ సీజన్ ను ప్రారంభించే అవకాశంలో ఉంది. అదేనిజం అన్నట్లు ప్రోమో కోసం నాగార్జున ఇంట్రో షూట్ కూడా పూర్తయింది. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. సెప్టెంబర్ లో వన్డే వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుండగా.. టీఆర్పీ రేటింగ్ కోసం ఒక నెల ముందుగానే సీజన్ ను మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు కూడా క్రికెట్ వల్ల బిగ్ బాస్ కు ఎఫెక్ట్ పడింది. ఈసారి అలా జరుగకుండా ముందు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.



Updated : 15 July 2023 1:35 PM IST
Tags:    
Next Story
Share it
Top