Home > గణేష్ పండుగ2020 > ‘బ్రిజ్‌ భూషణ్‌ను జూన్‌ 9లోగా అరెస్టు చేయాలి’

‘బ్రిజ్‌ భూషణ్‌ను జూన్‌ 9లోగా అరెస్టు చేయాలి’

‘బ్రిజ్‌ భూషణ్‌ను జూన్‌ 9లోగా అరెస్టు చేయాలి’
X

భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ను వారం రోజుల్లో అరెస్ట్ చేయాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌ ఆల్టీమేటం జారీ చేసింది. జూన్ 9లో అరెస్ట్ చేయకపోతే రెజ్లర్లతో సహా జంతర్‌ మంతర్‌ వద్ద దీక్షకు దిగడంతో పాటు.. దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేశ్‌ టికాయత్‌ హెచ్చరించారు. రెజ్లర్ల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.

" బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేయడంపై తాము ఒక నిర్ణయం తీసుకున్నాం. జూన్‌ 9లోగా ఆయనను అరెస్ట్‌ చేయకపోతే నిరసనలను మరింత తీవ్రం చేస్తాం. జూన్ 9న రెజ్లర్లతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్‌కు వెళ్తాం. దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తాం" అని టికాయిత్ హెచ్చరించారు. రెజ్లర్లు పూర్తిగా నిరుత్సాహానికి గురయ్యారని తెలిపారు. బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్ట్ చేసే వరకు తాము రాజీపడమని తెలిపారు. అతడిని అరెస్ట్ చేసే వరకు రెజ్లర్లకు ఏదైనా ప్రమాదం జరిగితే.. బ్రిజ్‌ భూషణ్‌‌ బాధ్యత వహించాలన్నారు. ఇప్పటికే వారి కుటుంబాలుకు బెదిరింపులు వస్తున్నాయని..వారి భద్రతను మరింత పెంచాలని టికాయిత్ డిమాండ్ చేశారు.


Updated : 2 Jun 2023 8:17 PM IST
Tags:    
Next Story
Share it
Top