Home > ఆరోగ్యం > Ganji Benefits : గంజినీళ్లు పాడేస్తున్నారా...? లాభాలు తెలిస్తే అస్సలు వదలరు

Ganji Benefits : గంజినీళ్లు పాడేస్తున్నారా...? లాభాలు తెలిస్తే అస్సలు వదలరు

Ganji Benefits : గంజినీళ్లు పాడేస్తున్నారా...? లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
X

మన పూర్వీకులు అప్పట్లో ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. అందుకు వారి ఆహారపు అలవాట్లు, జీవనశైలి ముఖ్య కారణం అని చెప్పక తప్పదు. సాధరణంగా అన్నం వండేప్పుడు గంజిని పారపోస్తుంటాం. కానీ అప్పటి వారు అలా చేసేవారు కాదు. ఇప్పుడంటే ఫ్యాషన్ అయింది కానీ. అప్పట్లో టిఫిన్లు లాంటివి పెద్దగా ఉండేవి కాదు. గంజిలో ఉప్పు, నిమ్మరసం కలుపుకొని తాగేవారు. కొంతమంది కేవలం గంజి అన్నం తిని ఉదయమే పనులకు వెళ్లేవారు. ఇప్పుడైతే అసలు గంజి ఊసే లేదు. గ్రామాల్లో కూడా దీన్ని తాగడం తగ్గించేశారు. అన్నం వండుకునే పద్దతుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. దీంతో గంజి దొరకడమే కష్టంగా మారింది. కానీ గంజితో కలిగే లాభాలు తెలిస్తే వావ్ అనాల్సిందే. ఇందులో ప్రోటీన్లు, క్యాల్షియం, జింక్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే మన పూర్వికులు ఎంతో బలిష్టంగా ఉండేవారు. కేవలం ఆరోగ్యమే కాదు గంజి తాగడం వల్ల చక్కటి అందం కూడా సొంతం అవుతుంది. కానీ ఈ విషాయాలేమి తెలియక ప్రస్తుతం చాలామంది అన్నం వండేప్పుడు గంజిని తీయడం లేదు, కొంత మంది ఎందుకు పనికి రాదని పారబోస్తుంటారు.

గంజిలో ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి విటమిన్లు, ఖనిజాలు చాలా ఉన్నాయి. డెయిలీ గంజి తాగే అలవాటు చేసుకుంటే ఇన్ఫెక్షన్లు దరిచేరవు. సాధారణంగా మహిళలకు వచ్చే పీరియడ్ పెయిన్స్ ను గంజి తగ్గిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే రిలాక్సింగ్ లక్షణాలు కండరాల సంకోచాల ఉపశమనానికి ఎంతగానో ఉపయోగపడతాయి. చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. బరువు తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు గంజి తాగితే కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఎందుకంటే ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఒక గ్లాస్ గంజి తాగితే పొట్ట నిండిన ఫీల్ ఉంటుంది. పెద్దగా ఆకలి కూడా వేయదు. ఎక్కువగా అలసిపోయేవారు గంజి నీళ్లు తాగితే వెంటనే శక్తిని పుంజుకుంటారు. గంజి నీళ్లలో బీ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇక చాలా మంది పసిపిల్లలు సరిగ్గా పాలు తాగరు. దీంతో వారి శరీరం బలహీనంగా మారిపోతుంది. ఇలా పాలు తాగేందుకు మారాం చేసే పిల్లలకు గంజినీరైనా తాగించాలంటారు నిపుణులు. గంజి నీళ్లు తాగించడం వల్ల వారు కోల్పోయిన విటమిన్స్, మినరల్స్‌ను తిరిగి పొందవచ్చు. విరేచనాలు వచ్చినప్పుడు చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమయాల్లో గంజి నీటిని తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ప్రతి రోజూ జిమ్ముల్లో వ్యాయామాలు చేసేవారు ప్రోటీన్ షేక్స్ ఎక్కువగా తీసుకుంటారు. ఇలాంటి వారు ప్రోటీన్ షేక్స్ కన్నా ఒక గ్లాసెడు గంజి తాగడం మంచిందంటున్నారు నిపుణులు. ఎందుకంటే గంజి నీళ్లు శరీరాన్ని శక్తివంతంగా తయారు చేస్తుంది. అదే విధంగా మజిల్ కూడా పెరిగేలా సహాయపడుతుంది. అంతే కాదు బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ వంటి వ్యాధులు రాకుండా రక్షణ కల్పిస్తుంది. రక్త పోటుతో బాధ పడేవారు గంజి తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్లు, ఫైటో కెమికల్స్, మెగ్నీషియం, పోటాషియం బీపీని కంట్రల్‎లో ఉంచుతాయి. మోషన్స్ , వాంతులు అయ్యే వాళ్లు గంజి తాగడం మంచిది. ఇది శరీరంలో కోల్పోయిన పోషకాలను తిరిగి అందిస్తుంది. చర్మం కాంతివంతంగా మెరవాలంటే ప్రతి రోజూ గంజి తాగాలి. ఎందుకంటే గంజిలో ఇనోసెటాల్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోకి వెళ్లినప్పుడు స్కిన్ గ్లోగా మారుతుంది. జుట్టు సమస్యలు ఉన్నా కూడా వాటిని గంజి తగ్గిస్తుంది. గంజి తాగడం వల్ల స్ట్రెస్ , ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంత, శారీరక ప్రశాంతత కూడా లభిస్తాయి. జీర్ణ వ్యవస్థ మెరుగయ్యేందుకు కూడా గంజి సహకరిస్తుంది. మల బద్ధకంతో ఇబ్బంది పడేవారు గంజి తాగడం వల్ల మంచి రిజల్ట్ పొందవచ్చు. ఇలాంటి వారు రోజూ గోరు వెచ్చని గంజి తాగితే ఇంకా మంచిది. గంజితో కలిగే లాభాలను. చూశారుగా మరి మీరు కూడా ప్రతి రోజూ గంజి తాగడం అలవాటు చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి.




Updated : 8 Jan 2024 11:46 AM GMT
Tags:    
Next Story
Share it
Top