Home > ఆరోగ్యం > లాభాపేక్ష ఆశించకుండా బసవతారకం ఆస్పత్రి నడుపుతున్నాం : బాలకృష్ణ

లాభాపేక్ష ఆశించకుండా బసవతారకం ఆస్పత్రి నడుపుతున్నాం : బాలకృష్ణ

లాభాపేక్ష ఆశించకుండా బసవతారకం ఆస్పత్రి నడుపుతున్నాం : బాలకృష్ణ
X

ఎలాంటి లాభాపేక్ష లేకుండా..కేవలం పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా బసవతారకం ఆస్పత్రి నడుపుతున్నామని ఆస్పత్రి ఛైర్మన్, నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. బసవతారకం ఆస్పత్రి 23వ వార్జికోత్సవానికి బాలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆసుపత్రిలో కొత్త పరికరాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ "2000 సంవత్సరంలో బసవతారకం ఆస్పత్రి స్థాపించాం. ఇప్పటి వరకు 3 లక్షల మంది రోగులకు సేవలు అందించారు. నేను కూడా గతంలో మెడికల్ ఎంట్రన్స్ రాశాను. సీటు రాదని తెలిసినా నాన్న కోరిక మేరకు రాశాను. దేశంలోనే రెండో ఉత్తమ క్యాన్సర్ ఆస్పత్రిగా నిలిచింది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి తెలంగాణ సర్కార్‌.. ఎంతగానో సహకరిస్తోంది. ఆస్పత్రి ఏర్పాటుకు టీడీపీ అధినేత చంద్రబాబు సహకారం అందించారు. క్యాన్సర్ రోగులకు సేవ చేయటంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు" అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

బసవతారకం ఆస్పత్రి 23వ వార్జికోత్సవ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు హీరోయిన్ శ్రీలీల, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, మహిళా క్రికెటర్ ప్రణవి చంద్ర తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ రోగులు ధృఢంగా ఉండి వ్యాధి నుంచి కోలుకోవాలని పీవీ సింధు కోరారు. కార్యక్రమంలో భాగంగా క్యాన్సర్ జయించిన వారిని, ఆస్పత్రికి విరాళాలు అందించిన దాతలను బాలకృష్ణ సత్కరించారు.


Updated : 22 Jun 2023 10:19 PM IST
Next Story
Share it
Top