COCONUT OIL : రాత్రి పడుకునే ముందు ఈ నూనె రాస్తే ఏమవుతుందంటే...
X
మెరిసేటి ఛర్మాన్ని ఎవరు కాదనుకుంటారు? అందులోనూ ఇది వింటర్ సీజన్. ముఖం డ్రైగా మారి గరుకుగా ఉంటుంది. స్కిన్ తెల్లతెల్లగా పాలిపోతుంది. ముఖాన్ని టచ్ చేస్తేనే మనకి మనకే చాలా ఇరిటేషన్‌గా ఉంటుంది. అందుకే ఈ సీజన్ లో ముఖం కాంతివంతంగా మెరిసేందుకు, స్కిన్ ని తేమను ఉంచుకునేందుకు వేలకు వేలు పోసి మరీ చాలా మంది కాస్ట్లీ క్రీములు వాడుతుంటారు. కానీ కొంత మంది మాత్రం కేవలం ఇంట్లో అందుబాటులో ఉండే కొబ్బరి నూనెను రాసుకుని ఊరుకుంటారు. ఇప్పుడంటే ఇన్ని క్రీములు, మేకప్ పార్లరు వచ్చాయి . కానీ, చిన్నప్పుడు చర్మం దురదగా అనిపించినా, కందిపోయినా, కొబ్బరి నూనే రాసేవారు. అయితే ఇలా కొబ్బరి నూనెను ముఖానికి రాయడం మంచిదేనా? రాస్తే ఏమవుతుంది ? ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖానికి కొబ్బరి నూనె రాసుకోవడం మంచిదే. కానీ ఎప్పుడు? ఎలా?ఎంత రాసుకోవాలి అనేది ముఖ్యం. ఆ ఫార్ములా తెలుసుకుంటే మెరుగైన ఫలితాలను పొందవచ్చంటారు సౌందర్య నిపుణులు. ముఖ్యంగా ఈ చలికాలంలో ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఒక స్పూన్ కొబ్బరి నూనె తీసుకుని దానిని రెండు చేతులతో బాగా రుద్ది ఆ తర్వాత ముఖానికి రాసుకుని స్మూత్ గా మసాజ్ చేయాలి. ఇలా ప్రతి రోజు మసాజ్ చేయడం వల్ల ముఖం తేమగా, కోమలంగా ఉంటుంది. చర్మం పొడిబారదు. అంతే కాదు ఇలా ముఖాన్ని మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ కూడా బాగా జరిగి చర్మం కాంతివంతంగా మారుతుంది. కోకోనట్ ఆయల్ లో ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ నూనెను ప్రతి రోజు పడుకునే ముందు ఫేస్ కి అప్లై చేస్తే చర్మంలోకి బాగా ఇంకిపోయి మొటిమల్ని కూడా రానివ్వవు. చలికాలంలో ఇరిటేషన్ తెప్పించే చర్మానికి స్వాంతన కలిగిస్తుంది.
డ్రై స్కిన్ ఉన్నవారికి కోకోనట్ ఆయిల్ మంచి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. ఈ నూనెలో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ నూనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పింపుల్స్ వల్ల ఏర్పడే వాపులను తగ్గిస్తాయి. కళ్ల కింద వచ్చే స్వెలింగ్ని కూడా నయం చేస్తుంది. పింపుల్స్, వాటి వల్ల వచ్చే మచ్చలను తగ్గిచడంలో కొబ్బరి నూనె ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అల్ట్రావయోలెంట్ రేస్‌ను నిరోధించే శక్తి కొబ్బరి నూనెకు ఉంది. అందుకే ఇది యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఈ నూనెనే న్యేచురల్ మేకప్ రిమూవర్‌గా ఉపయోగించొచ్చు. చెప్పాలంటే.. మేకప్‌ని తొలగించే క్లెన్సర్‌గా ఇది పనిచేస్తుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే చాలా మంది ఇప్పటికీ చలికాలంలో నూనెను ముఖానికి అప్లై చేస్తుంటారు. మరీ ముఖ్యంగా రాత్రి వేళల్లో నూనెతో ఫేస్‌ని మసాజ్ చేసుకోవడం వల్ల లాభాలు అనేకం. సో ఫ్రెండ్స్ ఈ టిప్స్ మీరు ఫాలో అయ్యి డ్రై స్కిన్ కి బై బై చెప్పేయండి.