Home > ఆరోగ్యం > డస్ట్ అలర్జీ వేధిస్తోందా?..ఈ ఆయుర్వేద చిట్కాలు మీకోసమే

డస్ట్ అలర్జీ వేధిస్తోందా?..ఈ ఆయుర్వేద చిట్కాలు మీకోసమే

డస్ట్ అలర్జీ వేధిస్తోందా?..ఈ ఆయుర్వేద చిట్కాలు మీకోసమే
X

సీజన్‌కు అనుగుణంగా వాతావరణంలో మార్పులు ఏర్పడతాయి. మారిన వాతావరణంతో అనేకరకమైన అలర్జీలు ,ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వేసవిలో వాతావరణం పొడిగా ఉంటుంది. ఈ సీజన్‎లో పుప్పొడితో అలర్జీలు ఏర్పడితే , వర్షాకాలంలో తడి కారణంగా వృద్ధి చెందే ఫంగస్, బ్యాక్టీరియాలతో అలర్జీలు వస్తుంటాయి. ఇక ఇప్పుడు ఈ శీతాకాలంలో దుమ్ము, పొగమంచు కారణంగా అలర్జీలు ఏర్పడతాయి. శీతాకాలంలో దుమ్ము తక్కువ ఎత్తులో వీస్తుంది, అందులోనూ సిటీల్లో రోడ్లపై దుమ్ము ఎలా ఉంటుందో తెలిసిన విషయమే. ఒక వాహనం వెళ్లిందంటే ఆ వాహనం వెనుక వచ్చేవారి పరిస్థితి మామూలుగా ఉండదు. అంతా దుమ్ముమయం అవుతుంటుంది. ఈ దుమ్ములో అనేకరకాల సూక్ష్మపురుగులు ఉంటాయి. ఇవి డస్ట్ అలెర్జీని కలుగజేస్తాయి. దీంతో ఒక్కసారిగా దగ్గు, తుమ్ములు, ముక్కు కారడం, కళ్లలో నీరు రావడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఒక్కోసారి ఈ అలర్జీని ఎదుర్కోవడం చాలా కష్టతరంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ అలర్జీలను ఎదుర్కోవడానికి ఆయుర్వేదంలో కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. మరి చలికాలంలో ఏర్పడే ఈ డస్ట్ అలర్జీలను ఆయుర్వేద పద్ధతుల్లో ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వంటింట్లో ఉండే ఓ శక్తివంతమైన మసాలా పసుపు . దీనినే సంస్కృతంలో 'హరిద్ర' అంటారు. ఇది డస్ట్ అలర్జీ సహా అనేక ఆనారోగ్యాలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. పర్యావరణం కారణంగా ఏర్పడే ఇరిటేషన్‏, దగ్గు, నొప్పులను పసుపు ఇట్టే తగ్గించేస్తుంది. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలులో పసుపు కలుపుకుని తాగితే డస్ట్ అలర్జీని ఇట్టే నివారించవచ్చు.

తులసి ఆకులతో డస్ట్ అలెర్జీలతో సహా అనేక శ్వాసకోశ ఇబ్బందులను నివారించవచ్చు. ఎందుకంటే తులసి ఆకుల్లో బయోయాక్టివ్, యాంటీమైక్రోబయల్ మూలకాలు పుష్కలంగా లభిస్తాయి. తులసి ఆకులను గోరువెచ్చని నీటిలో మరిగించి, ఆ నీటిని డిస్టిల్ చేసి తులసి హెర్బల్ టీని తయారు చేసి తాగడం వల్ల ఇన్ఫ్లమేషన్, డస్ట్ అలర్జీల సంకేతాల నుంచి ఉపశమనం పొందవచ్చు.

నల్ల జీలకర్ర యాంటీమైక్రోబయాల్ ఏజెంట్ల స్టోర్‌హౌస్. ఇది శ్వాసకోశంలో ఇన్ఫెక్షన్ , వాపును అడ్డుకుంటుంది. నల్ల జీలకర్రను సంస్కృతంలో 'కృష్ణ జీరకా' అని పిలుస్తారు. ఈ జీలకర్ర నూనె అలెర్జిక్ రినిటిస్‌కు చక్కని ఔషధంగా పని చేస్తుంది. ఈ నూనెను ముక్కు, గొంతుపై రోజుకు రెండుసార్లు రాసి, మసాజ్ చేయడం వల్ల ముక్కు , నోటి భాగాల డీకంజషన్‌లో సహాయపడుతుంది.

ఈ మధ్యకాలంలో యోగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అనేక రకల మానసిక, శారీరక సమస్యలను సాల్వ్ చేసే ఒక గొప్ప థెరపీ యోగా. అలర్జీలను సైతం నయం చేసే ఆసనాలు యోగాలో ఉన్నాయి. అర్ధచంద్రాసన, పవనముక్తాసన, వృక్షాసన, సేతుబంధాసన అలర్జీలకు ప్రయోజనకరమైన యోగాసనాలు. ప్రాణాయామం అలెర్జీ కారకాలకు శరీరం గురికాకుండా ఇమ్యూనిటీ పవర్‎ను పెంచడానికి సహాయపడుతుంది. ఇది శరీర కణాలకు సరైన పోషణ అందిస్తుంది, వ్యవస్థల పనితీరును మెరుగుపరుస్తుంది.

Updated : 14 Dec 2023 6:25 AM GMT
Tags:    
Next Story
Share it
Top