Home > ఆరోగ్యం > Winter Diet For Diabetes : చలికాలంలో షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే ఇలా చేయండి

Winter Diet For Diabetes : చలికాలంలో షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే ఇలా చేయండి

Winter Diet For Diabetes : చలికాలంలో షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే ఇలా చేయండి
X

చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు ఈ సీజన్‎లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే..బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది.

షుగర్ బాధితులు చలికాలంలో తరచూ బ్లడ్ షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గులతో తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. చలికి గంటల తరబడి ఒకేచోట కూర్చోవటం, ఎలాంటి వ్యాయామం లేకపోవడం, వ్యాయామం చేసేందుకు శరీరం సహకరించకపోవడం, నీరసం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే డయాబెటిస్ పేషెంట్స్ లో హుషారుతో పాటు సత్తువ వస్తుంది. షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్‎లో ఉంటాయి. ఈ సీజన్‎లో డయాబెటీస్ ఉన్నవారు ఇమ్యూనిటీని పెంచే ఆహారం తీసుకోవాలి. అలాంటి ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అందులో సిట్రస్ ఫ్రూట్స్ బ్లడ్‎లో షుగర్ లెవెల్స్‏ని తగ్గించేందుకు సహాయపడతాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మ, నారింజ పండ్లను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గోరువెచ్చని నీటినిలో నిమ్మను పిండి తాగినా, నారింజపండుని నేరుగా తిన్నా, లేదా జ్యూస్ చేసుకుని తాగినా మంచి ఫలితాలను పొందవచ్చు. రోజూ ఓ యాపిల్ తింటే ఒంటికి మంచిదని వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే ఈ పండులో 22 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 4 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. యాపిల్ బ్లడ్‏లో గ్లూకోజ్ లెవెల్స్‎పై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఇది కడుపు నిండిన ఫీల్‏ని కలిగిస్తుంది. షుగర్ బాధితులు యాపిల్ ను స్నాక్‌లా తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి వీటితో పాటే ఈ సీజన్‎లో ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరల్లో పాలకూర చాలా మంచిది. రోజూ ఓ కప్పు ఆకుకూర ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ ఆకుకూరలను కూరగా వండుకుని తిన్నా, లేదా సలాడ్‌ చేసుకుని తీసుకున్నా, దోశల్లో మిక్స్ చేసి తిన్నా ఆరోగ్యానికి మంచిదే.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే నట్స్ షుగర్ లెవెల్స్‎ను తగ్గించడంలో ఎఫెక్టివ్‎గా పనిచేస్తాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు హెల్దీ ఫ్యాట్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. అందుకే బాదం, వాల్‌నట్స్, పిస్తా, జీడిపప్పు, గుమ్మడి గింజలను డైలీ డైట్‎లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నట్స్‎ను నేరుగా తినకుండా రాత్రి నానబెట్టి, ఓట్స్‌లో కలిపి తీసుకుంటే మెరుగైన ఫలితాలను పొందవచ్చు.

క్యారెట్స్‌లో ఫైబర్ కంటెంట్ అధికం. ఇది రక్తప్రవాహంలో చక్కెరని స్లోగా రిలీజ్ చేస్తుంది. అందకే క్యారెట్స్ తిన్నప్పుడు కడుపు నిండినట్లు ఉంటుంది. లంచ్, డిన్నర్ ముందు క్యారెట్స్ తింటే హైపోగ్లైసీమియా తగ్గుతుందంటారు నిపుణులు. ఇక ఈ సీజన్ లో ఎక్కువగా లభించే ఉసిరిలో క్రోమియం పుష్కలంగా లభిస్తుంది. ఇది బ్లడ్‎లో షుగర్ లెవెల్స్‎ను బ్యాలెన్స్ చేసి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అంతే కాదు ఉసిరిలో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీ పెరిగేందుకు సహాయపడుతుంది. ఉసిరిని ఊరగాయగా, చట్నీగా, రసంలా ఎలా తీసుకున్నా మంచిదే. ​షుగర్ ఉన్నవారు తియ్యటి పదార్థాలకు దూరంగా ఉండాలంటారు. కానీ శీతాకాలంలో లభించే చిలగడదుంపను తినడం వల్ల షుగర్ బాధితులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చిలగడదుంపలో ఉండే ఫైటో కెమికల్స్ శరీరంలో విటమిన్ ఏ గా మారుతుంది. ఇది ఆరోగ్యరమైన చర్మాన్ని అందించడంతో పాటు , కంటి సమస్యల్ని దూరం చేస్తుంది.

బ్లడ్‎లో షుగర్ లెవెల్స్‎ను తగ్గించడంలో దాల్చిన చెక్క చాలా బాగా పనిచేస్తుంది. దాల్చిన చెక్క మెలమ్ గ్లూకోజ్, ట్రైగ్లిజరైడ్స్ రెండింటి స్థాయిని బ్యాలెన్స్ చేస్తుంది. ఇది హార్ట్ ప్రాబ్లమ్ రిస్క్ ని తగ్గిస్తుంది. దాల్చిన చెక్కను మిగతా ఆహారంలో యాడ్ చేయడంతో పాటు వారానికి ఓ దాల్చిన చెక్క వాటర్ తాగాలి. ఇది శరీరంలోమంటను తగ్గిస్తుంది. పసుపు కూడా ఆరోగ్యానికి మంచింది. ఈ డైట్ తో పాటు సమయానికి నిద్రపోవడం, వర్కౌట్స్ చేయడం వల్ల చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయవచ్చు.



Updated : 13 Dec 2023 1:56 PM IST
Tags:    
Next Story
Share it
Top