ముక్కులోంచి వెళ్ళి మెదడును తినేసిన అమీబా
X
కేరళలో ఓ వింత వైరస్ అందరినీ కలవరపెడుతోంది. అక్కడ అలప్పుజా జిల్లాలోని ఓ యువకుడు చనిపోయిన తీరు భయపెడుతోంది. కలుషిత నీటి నుంచి అమీబా కుర్రాడి ముక్కు ద్వారా బుర్రలోకి వెళ్ళి ఏకంగా అతడి మెదడునే తినేసింది.కేరళ ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం కేరళలో అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే వ్యాధి ప్రభలుతోంది. ఇది కలుషిత నీటి ద్వారా వ్యాపిస్తోంది. అలెప్పుజాలోని పనావల్లికి చెందిన కుర్రాడు కూడా దీని ద్వారానే చనిపోయాడు. బ్యాడ్ వాటర్ లో ఉండే అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ వ్యాధి సోకినప్పుడు బాధితుడు జ్వరం, తలనొప్పి, వాంతులు అవుతాయి. తర్వాత చనిపోతాడు. ముక్కు ద్వారా మెదడులోకి వెళ్ళిన అమీబా అక్కడ కణాలను తినేస్తుంది. ఇన్ఫెక్షన్ వ్యాపింపజేస్తుంది. ఈ అమీబా పేరు naegleria fowleri. ఇది కంటికి కనిపించదు. సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలుగుతారు.
కేరళలో ఇంతకు ముందు కూడా కేసులు వచ్చాయి. మొదటగా 2016లో తిరమాలలో...2019, 202లలో మలప్పురంలో రెండు కేసులు బయటకు వచ్చాయి. అలాగే 2020, 2022లల కోజికోడ్, త్రిశూర్లలో ఒక్కో కేస్ నమోదయ్యాయి. వీరందరూ చనిపోయారు.