Ghee For Weight Loss : రోజూ నెయ్యిని ఇలా తింటే..పొట్ట కొవ్వు అలా కరిగిపోతుంది
X
నెయ్యి, నూనెలు, పాల ఉత్పత్తులతో బరువు విపరీతంగా పెరిగిపోతామని చాలా మంది భయపడుతుంటారు. ఇక వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు భోజనంలో నెయ్యి వేసుకోవడమే మానేస్తుంటారు. అంతే కాదు నెయ్యితో తయారు చేసే ఏ స్వీట్లనైనా, వంటకాలలైనా అస్సలు పొరపాటున కూడా ముట్టనే ముట్టరు. వీలైనంత వరకు వాటికి దూరంగానే ఉంటారు. అయితే నెయ్యి తినడం వల్ల శరీర బరువు తగ్గుతుందంటే ఎవరైనా నమ్ముతారా? అవును ఇది నిజంగానే నిజం. నెయ్యిలో అధిక క్యాలరీలు ఉన్న మాట వాస్తవమే అయినా వాటితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని డైటీషియన్లు చెప్తున్నారు. భారత సంప్రదాయ వంటకాల్లోనూ, భోజనంలో నెయ్యి వినియోగం వల్ల బరువు తగ్గుతారని చెబుతున్నారు. ప్రతిరోజూ 1 స్పూన్ నెయ్యి తింటే మాత్రం వెయిట్ లాస్ గ్యారెంటీ అంటున్నారు. నెయ్యి తింటే లావవుతారని చాలా మంది ఫీలింగ్ . కానీ వాస్తవానికి ఓ క్రమ పద్ధతిలో నెయ్యి తీసుకుంటే మాత్రం చాలా ఈజీగా ఒంట్లోని కొవ్వును తగ్గించవచ్చు.
నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరానికి పోషకాలను గ్రహించే సామర్థ్యాన్ని అందిస్తుంది. తద్వారా బాడీ వెయిట్ ను సరిగ్గా మెయిన్టైన్ చేయవచ్చు. నెయ్యిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా విటమిన్ ఎ, ఇ, డి వంటి కొవ్వులో కరిగే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కిన్ కాల్షియం శోషణలో సహాయపడతాయి. చర్మాన్ని హెల్దీగా ఉంచుతాయి. నెయ్యిలో కేలరీలు ఉన్నప్పటికీ అవి వెయిట్‌ను తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తాయని డైటీషియన్లు చెబుతున్నారు. ఇందులో శాచ్యురేటెడ్ ఫ్యాట్ , మోనోశాచ్యురేటెడ్ కొవ్వులు ఉంటాయి. కాబట్టి నెయ్యి తినడం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉన్న ఫీల్ కలుగుతుంది. అతిగా తినే అలవాటు తగ్గుతుంది. ఈ విధంగా కూడా ఒకరకంగా బరువును కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇక దీర్ఘకాలంగా థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు నెయ్యి తినడం వల్ల థైరాయిడ్ హార్మోన్, ఒవర్ వెయిట్ రెండూ కంట్రోల్ లో ఉంటాయంటున్నారు నిపుణులు . నెయ్యిలో ఉండే అయోడిన్ థైరాయిడ్ హార్మోన్ పనితీరును , జీవక్రియను మెరుగుపరుస్తుంది. వెయిట్ కూడా లాస్ అవుతుంది.
కొబ్బరి, నువ్వుల నూనెలో ఎలా అయితే ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుందో ..నెయ్యిలో కూడా అలాగే హెల్దీ ఫ్యాట్ ఉంటుందంటున్నారు డైటీషియన్లు. ఒమేగా-3 ని కలిగి ఉన్న నెయ్యి తినడం వల్ల క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్, షుగర్ వంటి సమస్యల నుంచి దూరం కావొచ్చని చెబుతున్నారు. నెయ్యిలో ఉండే 'కంజుగేటెడ్ లినోలైక్' ఫ్యాటీ యాసిడ్ బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచుతుందని వివరిస్తున్నారు. అంతేకాదుక ఘీ వింటర్ సీజన్ లో మంచి మాయిశ్చురైజర్ గా కూడా పనిచేస్తుంది. డ్రై స్కిన్ తో బాధపడేవారు, పెదాలు పగిలే సమస్య ఉన్నవారు నెయ్యిని ఆయా భాగాల్లో అప్లై చేసుకుంటే స్కిన్ స్మూత్ గా మారుతుంది. అలాగే వాపులు, కాలిన గాయాలకు నెయ్యి మందుగా పనిచేస్తుంది. నెయ్యిలో ఉండే గ్యాస్ట్రిక్ యాసిడ్ శక్తిహీనతను తగ్గిస్తుంది. కీళ్ళ మధ్యన ఉండే జారుడు పదార్థాన్ని సంరక్షిస్తుంది. అందుకే ఇతర నూనె పదార్థాలను వేపుళ్ళకు వినియోగించకుండా నెయ్యిని వాడటం ఎంతో శ్రేయస్కరం.