Home > ఆరోగ్యం > 50 మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం.. ఏపీకి 5.. తెలంగాణకు ఎన్నంటే..!

50 మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం.. ఏపీకి 5.. తెలంగాణకు ఎన్నంటే..!

50 మెడికల్ కాలేజీలకు కేంద్రం ఆమోదం.. ఏపీకి 5.. తెలంగాణకు ఎన్నంటే..!
X

దేశంలో కొత్తగా 50 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో తెలంగాణలో 12, ఆంధ్రప్రదేశ్ లో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో కాలేజీలో 150 సీట్లతో 2023-24 విద్యా సంవత్సరం నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి.

తెలంగాణలో.. మేడ్చల్, కామారెడ్డి, కరీంనగర్, వరంగల్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, ఖమ్మం, నిర్మల్, సిరిసిల్ల, వికారాబాద్, హైదరాబాద్, జనగాంలలో కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. మేడ్చల్‌-మల్కాజిగిరిలో అరుంధతి ట్రస్ట్‌, వరంగల్‌లో కొలంబో ట్రస్ట్‌, మేడ్చల్‌లో సీఎంఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటవుతాయి. మిగతా అన్ని కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లో... ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం, విజయనగరం జిల్లాల్లో కాలేజీలు ఏర్పాటవుతాయి.




Updated : 8 Jun 2023 9:06 PM IST
Tags:    
Next Story
Share it
Top