Home > ఆరోగ్యం > చప్పట్లు కొడితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా...

చప్పట్లు కొడితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా...

చప్పట్లు కొడితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా...
X

ఎవరినైనా అభినందించడానికో లేదా మనకు బాగా సంతోష్ కలిగినప్పుడో చప్పట్లు కొడుతూ ఉంటాము. అవతలివారిని ఎంకరేజ్ చేయడానికి కూడా చప్పట్లు కొడతాము. కానీ వీటివల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుందట. శారీరక శ్రమ అవసరం లేని చప్పట్లు కొట్టడం మన మార్నింగ్ ఎక్సర్సైజ్ లో భాగం చేసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలని చెబుతున్నారు నిపుణులు.

క్లాప్ థెరపీ: మన శరీరం ఒక పెద్ద విచిత్రం. ఒంట్లో ప్రతీ పార్ట్ మరొక దానితో కనెక్ట్ యఅయి ఉంటాయి. కాళ్ళ దగ్గర నరాలు కూడా తలకు కనెక్ట్ అవుతాయి. ఇలా అవ్వడం వలన ఒకదాని ప్రభావం మరొకదాని మీద ఉంటుంది. మన శరీరంలోని 300 కంటే ఎక్కువ ఆక్యుప్రెషర్లు ఉంటాయి. ఇందులో ఎక్కువ భాగం చేతులలోనే ఉన్నాయి. ఈ ఆక్యుప్రెషర్ పాయింట్లకుమన గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్, జీర్ణవ్యవస్థతో సంబంధం ఉంటుంది. ఈ పాయింట్లను యాక్టివేట్ చేయడం వల్ల ఆ భాగాలను ఆరోగ్యంగా ఉంచవచ్చు.

ఆయుర్వేద వైద్యం ప్రకారం రోజూ 10 నుంచి 15 నిమిషాలు చప్పట్లు కొడితే శరీరంలో ఉన్న అన్ని భాగాలు ఒకదానికొకటి కనెక్ట్ అవుతాయిట. దీనివలన వ్యక్తిలోని ఏకాగ్రత, సామర్ధ్యం పెరుగుతాయి. చప్పట్లు కొట్టడం వల్ల రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మనం చప్పట్లు కొడితే.. అరచేతులు వేడెక్కుతాయి, శరీరమంతా రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది గుండె కండరాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది దాని ద్వారా గుండె సమస్యలను నివారిస్తుంది. చప్పట్లు శ్వాసకోస సమస్యలనూ దూరం చేస్తాయి.

నడుము నొప్పితో బాధపడేవారికి.. క్లాపింగ్‌ థెరపీ మంచి రిజల్ట్స్‌ ఇస్తుంది. మనం చప్పట్లు కొట్టినప్పుడు.. తుంటి కండరాలకు అనుసంధానంగా ఉన్న ఆక్యుప్రెషర్ పాయింట్లను స్టిమ్యూలేట్ చేస్తుంది. ఇది నొప్పి తీవ్రతను తగ్గిస్తుంది. ఎముక సంబంధిత సమస్యలకు మంచి పరిష్కారం అందిస్తుంది. అంతేకాదు క్లాపింగ్‌ థెరపీ ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. మనం చప్పట్లు కొట్టేప్పుడు.. ఉత్పన్నమయ్యే శక్తి మనస్సుకు సానుకూల సంకేతాలను పంపుతుంది. ఇది మానసిక కల్లోలం, నిరాశ, చంచలత్వం నుంచి ఉపశమనం ఇస్తుంది. మనస్సులో శాంతి, సంతోషకరమైన ఆలోచనలను సృష్టిస్తుంది. క్లాపింగ్‌ థెరపీ శరీరంలో హ్యాపీ హార్మోన్లను ప్రేరేపిస్తుంది.


Updated : 21 July 2023 5:25 PM IST
Tags:    
Next Story
Share it
Top