Health : సైలెంట్ కిల్లర్.. యాంటీ బయోటిక్స్
X
యాంటీ బయోటిక్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. జలుబు, దగ్గు, వంటి స్వల్పకాలిక వ్యాధులకు కూడా డాక్టర్ సలహా లేకుండానే చాలా మంది యాంటీ బయోటిక్స్‌ను వినియోగిస్తున్నారు. స్వల్పకాలిక లక్షణాలు ఉన్న వాటికి యాంటీబయాటిక్స్ తీసుకోవడం హానికరం. పదే పదే యాంటీబయాటిక్స్ తీసుకోవడం ద్వారా, శరీరంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా యాంటీబయాటిక్స్ వినియోగంపై ఆందోళన వ్యక్లం చేస్తుంది. తాజాగా దీనికి సంబంధించి కీలక నివేదికను ఆ సంస్థ విడుదల చేసింది. ఈ నివేదికలో, వైద్య సలహా తీసుకోకుండా మందులు తీసుకోవద్దని హెచ్చరించింది. యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాల వివరించింది.
రోగనిరోధక శక్తి బలహీనపడడం
యాంటీబయాటిక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. వైద్యుల సలహా లేకుండా మందులు తీసుకోవడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. దీని వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి.
బ్లడ్ ఇన్‌ఫెక్షన్స్
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, తరచుగా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల బ్లడ్ ఇన్ఫెక్షన్లు వస్తుంది. అదే సమయంలో, శరీరంలో యాంటీమైక్రోబయాల్ నిరోధకత ఏర్పడుతుంది. ఓవర్ ది కౌంటర్ ఔషధాలను తీసుకోవడం వల్ల తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. అందువల్ల, వైద్యుడిని సంప్రదించకుండా మందులు తీసుకోవడం మానుకోవాలి.
యాంటీబయాటిక్స్‌ల మితిమీరిన ఉపయోగం జీర్ణక్రియపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. చిన్న చిన్న జబ్బులకు కూడా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన మంచి బ్యాక్టీరియా కూడా హాని కలుగుతుంది. అతిసారం, కడుపు నొప్పి, వికారం కలిగించవచ్చు. వాంతులు, తల తిరగడం, విరేచనాలు, అలర్జీలు కూడా రావచ్చు.
యాంటీబయాటిక్స్ ఎప్పుడు తీసుకోవాలి?
ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ తీసుకోవద్దు. వైద్యుని సలహా మేరకు ఈ మందులను వాడాలి. జలుబు లేదా ఫ్లూ కోసం యాంటీబయాటిక్స్ పనితీరు ఆశించినస్థాయిలో ఉండదు. కాబట్టి జలుబు లేదా గొంతు నొప్పి ఉంటే, ఇంటి చిట్కాలను పాటించడం మేలు