కండ్లకలకకు ఆ డ్రాప్స్ వాడుతున్నారా? డాక్టర్ల హెచ్చరిక ఇదీ..
X
వాతావరణ మార్పుతో దేశవ్యాప్తంగా కండ్ల కలక సీజన్ నడుస్తోంది. పెద్ద జబ్బేం కాకపోవడంతో చాలామంది సొంత వైద్యం చేసుకుంటున్నారు. మెడికల్ షాపులకు వెళ్లి చుక్కలు మందు తెచ్చుకుని కళ్లద్దాలు పెట్టుకుని పని కానిస్తున్నారు. అయితే చుక్కల మందు విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే శుక్లం (గ్లకోమా) వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ చుక్కలను దీర్ఘకాలం వాడితే కళ్లపై ఒత్తిడి పెరిగి దుష్పరిణామాలు సంభవిస్తాయని చెబుతున్నారు.
కంజెక్టివైటిస్ లేదా ఐ ఫ్లూ అని వ్యవహరిస్తున్న ఈ వ్యాధికి జనం సొంతవైద్యంతో స్టెరాయిడ్ కంటి చుక్కలు వాడడం మంచిది కాదని అంటున్నారు. వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే వాడాలని సూచిస్తున్నారు. ‘‘ఈ చుక్కల వల్ల తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. మందులు వాడకపోతే ఒకటి రెండువారాల్లో తెగ్గిపోతుంది. అయితే బాధ భరించలేక మందులు వాడుతుంటారు. ఎడినో వైరస్ వల్ల వచ్చిన కండ్ల కలకకు మాత్రమే స్టెరాయిడ్ చుక్కలు వాడాలి. ఇతరులకు సోకుండా కళ్లద్దాలు పెట్టుకుని, చేతులు, ముఖం శుభ్రం చేసుకోవాలలి. కార్టికో స్టెరాయిడ్స్ వాడడం వల్ల శుక్లం వచ్చే ప్రమాదముంది’’ అని ఢిల్లీకి చెందిన ప్రముఖ నేత్ర వైద్యుడు జె.ఎస్.భల్లా తెలిపారు. 30 శాతం కండ్ల కలక కేసులకు ఎడినో వైరస్ కారణం కాదని ఎయిమ్స్ వైద్యుడు జేఎస్ టిటియల్ చెప్పారు. బ్యాక్టీరియా వల్లే ఎక్కువ కేసులు వస్తున్నాయని, అలాంటి కేసుల్లోనే యాంటీ బయాటిక్స్ వాడాలని సూచించారు.