Home > ఆరోగ్యం > కూల్ డ్రింక్స్ వల్ల కేన్సర్ వస్తుంది-WHO

కూల్ డ్రింక్స్ వల్ల కేన్సర్ వస్తుంది-WHO

కూల్ డ్రింక్స్ వల్ల కేన్సర్ వస్తుంది-WHO
X

కూల్ డ్రింక్....దీన్ని తాగొద్దని ఎప్పటి నుంచో చెబుతున్నారు. వీటిలో మన శరీరానికి హాని చేసే పదార్ధాలు చాలా ఉన్నాయని అంటారు. బాత్రూం క్లీనింగ్ లిక్విడ్, కూల్ డ్రింక్ లు ఒకటే అని కూడా చెబుతారు. ఇప్పుడు కొత్తగా కూల్ డ్రింక్స్ లో కేన్సర్ కారకాలు ఉన్నాయని చెబుతున్నారు. అది కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహోవో నే స్వయంగా ప్రకటించింది.

మనం తినే చాలా పదార్ధాల్లో కేన్సర్ కారకాులు ఉంటాయి. అంతమాత్రాన అవి మొత్తంగా తినేయడం మానేయక్కర్లేదు కూడా. మొతాదుకు తగ్గట్టుగా తింటే ఏమీ అవదు. అంతకు మించి తీసుకుంటేనే ముప్పు అంతా. ఇప్పుడు కూల్ డ్రింకుల్లో కూడా కేన్సర్ రావడానికి కారకమైన అస్పారెక్టమ్ ఉందని తేల్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కూల్ డ్రింక్స్ లో ఉపయోగించే కృత్రిమ చక్కెరలో ఇది ఉందని చెబుతోంది. అయితే వీటి ఉత్పత్తి మానేయమని సంస్థలకు కానీ, వినియోగదారులకు కానీ చెప్పడం లేదని అంది. కేవలం అవగాహన కోసమే చెబుతున్నామని....మోతాదుకు మించి కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళు దీన్ని దృస్టిలో పెట్టుకోవాలని సూచించింది.

డబ్ల్యూహెచ్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్ జూన్ 6 నుంచి 13 వరకు ఫ్రాన్స్‌లోని లియోన్‌లో జరిగిన సమావేశంలో అస్పార్టేమ్ ను కేన్సర్ కారకమని మొట్టమొదటిసారిగా అంచనా వేసింది. అస్పార్టేమ్ కారణంగా మానవుల్లో కేన్సర్ వచ్చే అవకాశం ఉందని ఐఏఆర్సీ బృందం వర్గీకరించినట్టు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. మనుషుల్లో కేన్సర్‌కు కారణమయ్యే అవకాశాలు ఉన్న గ్రూప్ 2బీలో అస్పార్టేమ్‌ను చేర్చింది. ప్రత్యేకంగా ఒక రకమైన కాలేయ కేన్సర్ కు ఇది కారకమవుతుందని నిరూపించింది. టీ, కాఫీలలో ఉండే కెఫిక్ యాసిడ్‌‌, అలోవేరా గ్రూప్ 2బి కేటగిరీలో ఉందని లాస్ ఏంజిల్స్‌లోని సెడార్స్ సినాయ్ మెడికల్ సెంటర్‌ కేన్సర్ ఎపిడిమియాలజీ ప్రొఫెసర్ పాల్ ఫారోహ్ చెప్పారు. అస్పార్టేమ్ అనేది 1980ల నుంచి వివిధ ఆహార, పానీయాల ఉత్పత్తులలో విస్తృతంగా ఉపయోగించే ఒక కృత్రిమ రసాయన స్వీటెనర్. ఇది డైట్ డ్రింక్స్, చూయింగ్ గమ్, జెలటిన్, ఐస్ క్రీం, పెరుగు లాంటి పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, టూత్‌పేస్ట్, దగ్గు, చుక్కల మందులలో దీనిని వినియోగిస్తారు.


Updated : 14 July 2023 4:12 PM IST
Tags:    
Next Story
Share it
Top