Jn.1 Covid Variant : 4,334 కేసులు 12 మరణాలు.. పెరుగుతున్న కరోనా కేసులు
X
దేశంలో కరోనా (COVID-19) బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం దేశవ్యాప్తంగా 761 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 12 మంది మరణించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, కేరళలో 5 , కర్ణాటకలో 4, మహారాష్ట్రలో 2, ఉత్తరప్రదేశ్‌లో 1 మరణాలు సంభవించాయి. మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కనిపిస్తోంది. అయితే, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరిన వారి లేదా మరణాల సంఖ్య తక్కువగా ఉంది.
డిసెంబర్ 5 వరకు, దేశంలో రోజువారీ కొత్త కరోనా కేసుల సంఖ్య రెండంకెలలో ఉంది. కానీ శుక్రవారం నాటికి అది భారీగా పెరుగింది. వాతావరణ మార్పులు, పెరుగుతున్న చలి కారణంగా కోవిడ్-19 రోగులు పెరుగుతున్నారు. శుక్రవారం రోజున కర్ణాటకలో 199, కేరళలో 148, మహారాష్ట్రలో 110, గోవాలో 47, గుజరాత్‌లో 36, ఆంధ్రప్రదేశ్‌లో 30, తమిళనాడులో 26, ఢిల్లీలో 15, రాజస్థాన్‌లో 4, తెలంగాణలో 2, ఒడిశాలో ఒక్కొక్కటీ చొప్పున కేసులు నమోదయ్యాయి. క్రియాశీల కేసులు 4,423 నుండి 4,334కి తగ్గినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది.
తెలంగాణలో కరోనా కేసులు
తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసులకు సంబంధించిన పూర్తి అప్‌డేట్స్ సకాలంలో వెల్లడికావడం లేదు. జనవరి 3 న, తెలంగాణలో ఎనిమిది రికవరీలతో ఆరు కోవిడ్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 40 క్రియాశీల కేసులు ఉన్నట్లు తెలుస్తుంది