Home > ఆరోగ్యం > Health Tips : షాకింగ్..సిగిరెట్‌ కంటే బ్రాయిలర్‌ చికెన్‌ అత్యంత ప్రమాదం!

Health Tips : షాకింగ్..సిగిరెట్‌ కంటే బ్రాయిలర్‌ చికెన్‌ అత్యంత ప్రమాదం!

Health Tips : షాకింగ్..సిగిరెట్‌ కంటే బ్రాయిలర్‌ చికెన్‌ అత్యంత ప్రమాదం!
X

చాలా మందికి కోడి మాంసం అంటే ఎంతో ఇష్టం. మరికొందరు ఆదివారం వస్తే చాలు చికెన్ తినకుండా ఉండలేరు. ఇంకొందరు కోడిమాంసాన్ని విపరీతంగా తింటూ ఉంటారు. ఈ కోడిమాంసాల్లో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణను బ్రాయిలర్ చికెన్ పొందింది. ఇది మెత్తగా, చౌకగా ఉండటం వల్ల అందరూ దీన్ని కొంటారు. అయితే ఈ బ్రాయిలర్ చికెన్ వల్ల అత్యంత హాని జరుగుతోందని చాలా మందికి తెలియదు. సూటిగా చెప్పాలంటే సిగరెట్ తాగడం కంటే ఈ బ్రాయిలర్ చికెన్ తినడం అత్యంత ప్రమాదకరం. సాధారణంగా పౌల్ట్రీల్లోనే ఈ బ్రాయిలర్ కోళ్లను పెంచుతుంటారు. అయితే అక్కడే అందరికీ తెలియని ఓ హాని జరుగుతోంది.





కోళ్లలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు అనేక రకాల యాంటీబయోటిక్స్‌ను పౌల్ట్రీలో వినియోగిస్తారు. మనం ఆ బ్రాయిలర్ కోడి మాంసం తినప్పుడు అందులోని యాంటీబయోటిక్ మన శరీరంలోకి వెళ్తుంది. దానివల్ల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. బ్రాయిలర్ కోళ్లను వేగంగా పెంచేందుకు అనేక రసాయన పద్ధతులను వాడుతారు. ఆ రసాయనాలు మనుషులకు హానికరమైనవి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు బ్రాయిలర్ చికెన్‌ను తినకూడదు. అలాగే వివిధ రకాల మందులు తీసుకుంటున్నవారు కూడా బ్రాయిలర్ చికెన్ తినడం మానుకోండి.





ఈ బ్రాయిలర్ కోళ్లలో ఈ-కోలి బ్యాక్టీరియా అనేది ఉండటం వల్ల అది ఫుడ్ పాయిజనింగ్‌కు కారణం అవుతుంది. ఆ కోళ్లలో ఉత్పత్తి చేసే కొవ్వు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను అమాంతం పెంచేస్తుంది. క్రమం తప్పకుండా బ్రాయిలర్ చికెన్ అతిగా తినేవారికి గుండెపోట్లు ఎక్కువగా వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఈ మాంసాన్ని క్రమం తప్పకుండా తినే పురుషుల్లో సంతాన సమస్యలు వస్తాయని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి.


Updated : 3 Feb 2024 3:20 AM GMT
Tags:    
Next Story
Share it
Top