health updates : హైదరాబాద్లో వేగంగా విస్తరిస్తున్న వ్యాధి!
X
తెలంగాణ రాష్ట్రంలో డెంగీ వ్యాధి విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో డెంగీ పంజా విసురుతోంది. రాష్ట్రంలో ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో 961 కేసులు నమోదు కాగా, ఆగస్ట్ నెలలో సరాసరి రోజుకు వందమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. సెప్టెంబర్ మూడు నాలుగు వారాల్లో డెంగీ కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా డెంగీ కారక దోమ వృద్ధి చెందిందని చెప్పారు. ప్రజలు పగటి పూట దోమ కుట్టకుండా చూసుకుంటే డెంగీ బారిన పడే అవకాశం తగ్గుతుందని తెలిపారు.
హైదరాబాద్ లో కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. జ్వరం, దగ్గు, తలనొప్పి, బాడీ పెయిన్స్ అంటూ ఫీవర్ ఆస్పత్రికి తరలి వెళ్తున్నారు. దాంతో ఫీవర్ హాస్పిటల్ లో రోజుకు 500, గాంధీ, ఉస్మానియా హాస్పిటల్లో కలిపి 6 వేల ఓపీ కేసులు నమోదవుతున్నాయి. ప్రతి 100 మందిలో 10 నుంచి 15 వరకు డెంగీ, మలేరియా లక్షణాలు బయటపడుతున్నాయి. గత 3 నెలల్లో 1082 కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. దాంతో గ్రేటర్ వ్యాప్తంగా ముందస్తు చర్యలు ప్రారంభించారు. 2, 3 రోజులైనా జ్వరం తగ్గకపోతే టెస్టులు చేయించుకోవాలని సూచించారు.